te_tw/bible/kt/authority.md

3.9 KiB

అధికారం, అధికారులు

నిర్వచనం:

"అధికారం" అనే పదం సాధారణంగా ప్రభావం యొక్క స్థానం, బాధ్యత లేదా మరొక వ్యక్తి మీద పరిపాలనను సూచిస్తుంది.

  • రాజులు, పరిపాలన చేసే ఇతర అధికారులు, తాము పరిపాలిస్తున్న వారిమీద అధికారం కలిగియుంటారు.
  • "అధికారులు" అనే పదం ఇతరులమీద అధికారం కలిగియున్న మనుషులనూ, ప్రభుత్వాలనూ, లేక సంస్థలనూ సూచిస్తుంది.
  • "అధికారులు" అనే పదం దేవుని అధికారానికి లోబడని ప్రజలమీద శక్తిని కలిగియున్న ఆత్మ జీవులను కూడా సూచిస్తుంది.
  • యజమానులకు వారి సేవకుల మీదా లేదా బానిసలమీదా అధికారం ఉంటుంది. తల్లిదండ్రులకు వారి పిల్లలమీద అధికారం ఉంటుంది.
  • ప్రభుత్వాలకు వారి పౌరులకోసం చట్టాలు చేసే అధికారం, లేక హక్కు ఉంటుంది.

అనువాదం సూచనలు:

  • "అధికారం" అనే పదాన్ని "అధికారం" లేదా “హక్కు” లేదా “అర్హతలు" అని కూడా అనువదించవచ్చు.
  • కొన్నిసార్లు "అధికారం" అనే పదం "శక్తి" అనే అర్థంతో ఉపయోగించడం జరుగుతుంది.
  • "అధికారులు" అనే పదం ప్రజలను పరిపాలించే వారినీ లేదా సంస్థలనూ సూచించడానికి ఉపయోగించినప్పుడు ఈ పదాన్ని "నాయకులు" లేదా "పాలకులు" లేదా "శక్తులు" గా కూడా అనువదించబడవచ్చు.
  • "తన సొంత అధికారం చేత" అనే పదబందం "నడిపించడానికి తన సొంత హక్కుతో" లేదా “తన స్వంత అర్హతల ఆధారంగా" అని కూడా అనువదించబడవచ్చు.
  • "అధికారం కింద" అనే వ్యక్తీకరణ "లోబడడానికి బాధ్యత” లేదా “ఇతరుల ఆజ్ఞలకు లోబడి యుండడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: రాజు, పాలకుడు, శక్తి,

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247