te_tw/bible/kt/power.md

5.9 KiB

శక్తి, శక్తిగల, శక్తివంతంగా

నిర్వచనం:

"శక్తి" పదం కార్యాలను చెయ్యగలిగే లేదా జరిగేలా చూసే సామర్ధ్యాన్ని సూచిస్తుంది. తరచుగా గొప్ప బలాన్ని సూచిస్తుంది. "శక్తులు" కార్యాలను జరిగేలా చేసే సామర్ధ్యం కలిగిన మనుష్యులను లేదా ఆత్మలను సూచిస్తుంది.

  • "దేవుని శక్తి" పదం సమస్తాన్ని చెయ్యగల దేవుని శక్తిని సూచిస్తుంది, ప్రత్యేకించి మనుష్యులకు చెయ్యడానికి సాధ్యం కాని కార్యాలను చెయ్యగల దేవుని శక్తిని సూచిస్తుంది.
  • దేవుడు తాను చేసిన సమస్తం మీదా సంపూర్ణ శక్తిని కలిగియున్నాడు.
  • దేవుడు తాను కోరుకున్న దానిని చెయ్యడానికి తన ప్రజలకు శక్తిని ఇస్తాడు, తద్వారా వారు ప్రజలను స్వస్థపరుస్తారు లేదా ఇతర ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు, దేవుని శక్తి ద్వారా వారు వీటిని చేస్తారు.
  • యేసూ, పరిశుద్దాత్మడూ దేవుడు కనుక వారు కూడా ఈ శక్తినే కలిగియున్నారు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి "శక్తి" పదం "సామర్ధ్యం" లేదా "బలం" లేదా "సమర్ధత" లేదా అద్భుతాలు చేయడానికి శక్తి" లేదా "నియంత్రణ" అని అనువదించబడవచ్చు.
  • "శక్తులు" పదం "శక్తివంతమైన జీవులు" లేదా ఇతరులను నియంత్రించు వారు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

(చూడండి: పరిశుద్ధాత్ముడు, యేసు, అద్భుతం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 22:05 దూత వివరించాడు, "పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, దేవుని శక్తి నీ మీదకు వచ్చును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అవుతాడు, దేవుని కుమారుడు అవుతాడు.
  • 26:01 సాతాను శోధనలను జయించినతరువాత, యేసు పరిశుద్ధాత్మ శక్తి నిండుకొనినవాడై గలిలయ ప్రాంతాలకు తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన నివాసం చేశాడు.
  • 32:15 వెంటనే శక్తి ఆయనలోనుండి వెళ్ళిపోవడం ఆయన గుర్తించాడు.
  • 42:11 మృతులలోనుండి ఆయన లేచిన తరువాత నలుబది రోజులకు ఆయన తన శిష్యులతో "పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చిన తరువాత తండ్రి మీకు శక్తి ని అనుగ్రహించేంతవరకూ మీరు యెరూషలేములో నిలిచియుండండి" అని చెప్పాడు.
  • 43:06 “ఇశ్రాయేలు మనుష్యులారా, మీరు చూచినవిధంగానూ, మీకు తెలిసిన విధముగానూ యేసు దేవుని శక్తి చేత గొప్ప సూచకక్రియలనూ, అనేక అద్భుతాలనూ జరిగించిన వాడు.
  • 44:08 పేతురు జవాబిచ్చాడు, "మీ ముందు నిలబడిన ఈ మనిషి యేసు క్రీస్తు శక్తి చేత స్వస్థపరచబడ్డాడు.

పదం సమాచారం:

  • Strong's: H410, H1369, H2220, H2428, H2429, H2632, H3027, H3028, H3581, H4475, H4910, H5794, H5797, H5808, H6184, H7786, H7980, H7981, H7983, H7989, H8280, H8592, H8633, G1411, G1415, G1756, G1849, G1850, G2478, G2479, G2904, G3168