te_tw/bible/kt/miracle.md

7.9 KiB

అద్భుతం, అద్భుతాలు, ఆశ్చర్యం, ఆశ్చర్యాలు, సూచన, సూచనలు

నిర్వచనం:

“అద్భుతం” అంటే దేవుడు దానిని కలుగజేయకపోతే సాధ్యం కాని అద్భుత కార్యం.

  • యేసు చేసిన అద్భుతాలలో నీటిని నిమ్మళ పరచడం, గుడ్డివానిని బాగు చెయ్యడం ఉన్నాయి.
  • అద్బుతాలను “ఆశ్చర్యకార్యాలు “ అని కొన్నిసార్లు అంటారు, ఎందుకంటే ప్రజలు ఆశ్చర్యపోయేలా, నిర్ఘాంతపోయేలా చేసే కార్యాలు.
  • ”ఆశ్చర్యం” అనే పదం ఆకాశాన్ని భూమిని కలుగజేసినప్పుడు సాధారణంగా దేవుని శక్తిని అద్భుతంగా కనిపిస్తుంది అని తెలియజేస్తుంది.
  • అద్భుతాలను “సూచకక్రియలు” అని కూడా పిలువవచ్చు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిగలవాడు అని అవి సూచకలుగా లేక రుజువులుగా వినియోగించబడతాయి, సర్వ భూమి మీద ఆయనకే సంపూర్ణ అధికారం ఉంది.
  • కొన్ని అద్భుతాలు, ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంనుండి కాపాడినప్పుడు, సింహాల బోనులో దానియేలును భద్రపరచినప్పుడు జరిగిన దేవుని విమోచనా క్రియలు,
  • కొన్ని అద్భుతాలు, నోవాహు కాలంలో ప్రపంచ వ్యాపిత జలప్రళయం రప్పించడం, మోషే కాలంలో ఐగుప్తు ప్రజల మీద భయంకరమైన తెగుళ్ళు రప్పించడం లాంటివి ఆయన తీర్పు కార్యాలు.
  • దేవుని అద్భుతాలలో అనేకం రోగులను స్వస్థపరచే కార్యాలు, చనిపోయినవారిని సజీవులుగా చెయ్యడం.
  • యేసులో దేవుని శక్తి కనిపించింది, ప్రజలను బాగుచెయ్యడం, తుఫానులను నిమ్మళపరచడం, నీటిమీద నడవడం, చనిపోయినవారిని లేపడం వంటి అద్భుతాలలో దేవుని శక్తి కనిపిస్తుంది. ఇవన్నీ అద్భుతాలు.
  • ప్రవక్తలూ, అపొస్తలులు కూడా స్వస్థతలూ, దేవుని శక్తి ద్వారా మాత్రమే సాధ్యమయ్యే కార్యాలు చేసేలా దేవుడు వారిని బలపరచాడు,

అనువాదం సూచనలు:

  • ”అద్భుతాలు” లేక “ఆశ్చర్యకార్యాలు” అనే పదాలను “దేవుడు చేసే అసాధ్యకార్యాలు” లేక “దేవుని శక్తివంతమైన క్రియలు” లేక “దేవుని అద్భుత క్రియలు” అని అనువదించవచ్చు.
  • ”సూచనలు, అద్బుతాలు” అని తరచుగా ఉపయోగించే పదాన్ని “రుజువులు, అద్భుతాలు” లేక “దేవుని శక్తిని రుజువుచేసే అద్భుత కార్యాలు” లేక “దేవుడు గొప్పవాడు అని చూపే ఆయన ఆశ్చర్యకరమైన అద్భుతాలు” అని అనువదించవచ్చు.
  • అద్భుతమైన సూచకక్రియ అనే పదం దేనికైనా రుజువు లేక సాక్ష్యం అనేదానికి భిన్నంగా ఉంటుందని గమనించాలి. ఇవి రెండు ఒకదానికొకటి సంబంధపడి యున్నాయి.

(చూడండి: శక్తి, ప్రవక్త, అపొస్తలుడు, సూచన)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 16:08 ఇస్రాయేలీయులను రక్షించడానికి తనను వాడుకొంటున్నాడు అని గిద్యోను తెలుసుకోడానికి గిద్యోను దేవుణ్ణి రెండు సూచనలను అడిగాడు.
  • 37:10 దేవుడు ఎలిషా ద్వారా అనేక అద్భుతాలు చేసాడు.
  • __37:10__ఈ అద్భుతం ద్వారా యూడులనేకులు యేసు నందు విశ్వాసముంచారు.
  • 43:06”ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చూచినవిధంగా, ఇంతకు ముందు తెలుసుకొన్నవిధంగా యేసు అను ఈ మనుష్యుడు దేవుని శక్తి ద్వారా అనేక సూచకక్రియలను, ఆశ్చర్య కార్యాలను చేసాడు.
  • 49:02 తాను దేవుడనని రుజువు పరచునట్లు యేసు అనేక ఆశ్చర్యక్రియలను చేసాడు. ఆయన నీటిమీద నడిచాడు, తుఫానులను నిమ్మలపరచాడు, రోగులను బాగు చేసాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయినవారిని లేవనెత్తాడు, ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను 5,000 మందికి పైగా సరిపోయే ఆహారంగా మార్చాడు.

పదం సమాచారం:

  • Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H5953, H6381, H6382, H6383, H6395, H6725, H7560, H7583, H8047, H8074, H8539, H8540,, G880, G1213, G1229, G1411, G1569, G1718, G1770, G1839, G2285, G2296, G2297, G3167, G3902, G4591, G4592, G5059