te_tw/bible/kt/prophet.md

9.4 KiB

ప్రవక్త, ప్రవచనం, భవిష్యత్తును చెప్పడం, దీర్ఘదర్శి, ప్రవక్త్రిని

నిర్వచనం:

“ప్రవక్త” అంటే ప్రజలకు దేవుని సందేశాన్ని చెప్పేవాడు. ఈ కార్యాన్ని చేసే స్త్రీని “ప్రవక్తిని” అని పిలుస్తారు.

  • తరచుగా ప్రవక్తలు ప్రజలు తమ పాపములనుండి తిరిగి దేవునికి విధేయులు కావాలని హెచ్చరించారు.
  • “ప్రవచనము” అంటే ప్రవక్త మాట్లాడే సందేశం అని అర్థం. “ప్రవచించడం” అంటే దేవుని సందేశాన్ని చెప్పడం అని అర్థం.
  • తరచుగా ప్రవచన సందేశము భవిష్యత్తులో జరగబోవుదానిని గురించి ఉంటుంది.
  • పాత నిబంధనలోనున్న అనేక ప్రవచనములు ఇప్పటికే నెరవేర్చబడియున్నాయి.
  • బైబిలులో ప్రవక్తల చేత రాయబడిన అనేక గ్రంథాలు కొన్ని సార్లు "ప్రవక్తలు" అని సూచించబడతాయి.
  • ఉదాహరణకు, “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే ఈ మాట హెబ్రీ లేఖనములన్నిటిని సూచిస్తుంది, దీనిని “పాత నిబంధన” పిలుస్తాము.
  • “దీర్ఘదర్శి” లేక “చూచే వ్యక్తీ” అనే పదం ప్రవక్త కోసం వాడబడింది.
  • కొన్నిమార్లు “దీర్ఘదర్శి” పదం అబద్దపు ప్రవక్తను లేదా శకునము చెప్పే అభ్యాసాలను జరిగించేవాడిని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • “ప్రవక్త” పదం “దేవుని ప్రతినిధి” లేదా “దేవుని కొరకు మాట్లాడే వ్యక్తి” లేదా “దేవుని సందేశములను మాట్లాడే వ్యక్తి” అని అనువదించబడవచ్చు.
  • “దీర్ఘదర్శి” పదం “దర్శనములు చూసే వ్యక్తి” లేదా “దేవుని నుండి భవిష్యత్తును చూడగలిగే మనుష్యుడు” అని అనువదించవచ్చు.
  • “ప్రవక్తినులు పదం “దేవునికి స్త్రీ ప్రతినిధి” లేదా “దేవుని కొరకు మాట్లాడే స్త్రీ” లేదా “దేవుని సందేశాలను మాట్లాడే స్త్రీ” అని అనువదించబడవచ్చు.
  • “ప్రవచనము” పదం అనువాదంలో “దేవుని నుండి సందేశము” లేదా “ప్రవక్త సందేశము” అని ఉండవచ్చు.
  • “ప్రవచించడం” పదం “దేవుని నుండి మాటలను పలుకడం” లేదా “దేవుని సందేశాన్ని చెప్పు" అని అనువదించబడవచ్చు.
  • “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే అలంకారిక వాక్యము, “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల పుస్తకములు” లేదా “దేవుడు గురించీ, తన ప్రజలను గురించి వ్రాయబడిన ప్రతీది, ఇందులో ప్రవక్తలు బోధించినవి మరియు దేవుని కట్టడలు" ఉన్నాయి.
  • అబద్ధపు దేవుని ప్రవక్తను (లేక దీర్ఘదర్శిని) సూచించేటప్పుడు, దీనిని “అబద్ధ ప్రవక్త (దీర్ఘదర్శి)” లేదా “అబద్దపు దేవుని ప్రవక్త (లేక దీర్ఘదర్శి)” లేదా “బయలు ప్రవక్త” అని తర్జుమా చేయవలసిన అవసరత ఉంటుంది.

(చూడండి: బయలు, శకునము, అబద్దపు దేవుడు, అబద్ద ప్రవక్త, నెరవేర్చడం, మోషే ధర్మశాస్త్రము, దర్శనము)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 12:12 ఐగుప్తీయులు చనిపోయారని ఇశ్రాయేలీయులు చూచినప్పుడు, వారు దేవునియందు విశ్వాసముంచిరి మరియు మోషే దేవుని ప్రవక్త అని విశ్వాసం ఉంచారు.
  • 17:13 దావీదు చేసిన పనినిబట్టి దేవుడు కోపగించుకొనెను, ఇందుచేత దావీదు చేసిన పాపము ఎంత ఘోరమైనదని చెప్పుటకు దేవుడు నాతాను ప్రవక్తను దావీదునొద్దకు పంపించాడు.
  • 19:01 ఇశ్రాయేలీయుల చరిత్రయందంతంటిలో దేవుడు వారియొద్దకు ప్రవక్తలను పంపెను. దేవుని నుండి వచ్చు సందేశములను ప్రవక్తలు విని, ఆ దేవుని సందేశములను వారు ప్రజలకు వినిపించారు.
  • 19:06 ఇశ్రాయేలు రాజ్యము యొక్క సమస్త ప్రజలందరూ మరియు బయలు దేవతకు సంబంధించిన 450 మంది ప్రవక్తలు కర్మెలు పర్వతము వద్దకు వచ్చిరి.
  • 19:17 అనేకసార్లు ప్రజలు దేవునికి విధేయత చూపలేదు. వారు అనేకమార్లు ప్రవక్తలను అగౌరపరచారు, మరియు కొన్నిమార్లు వారిని హతమార్చారు.
  • 21:09 మెస్సయ్యా కన్య మరియ గర్భాన జన్మిస్తాడని ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు.
  • 43:05 “అంత్యదినములలో, నా ఆత్మను కుమ్మరించెదను” అని దేవుడు చెప్పిన మాటను యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడి, నెరవేర్చబడెను.
  • 43:07 “నీవు పరిశుద్ధుని సమాధిలో ఉండనివ్వవు” అని చెప్పబడిన ప్రవచనమును నెరవేర్చావు.
  • 48:12 దేవుని వాక్యమును ప్రకటించిన మోషే గొప్ప ప్రవక్త. అయితే యేసు అందరిలో గొప్ప ప్రవక్త. ఆయనే దేవుని వాక్యమైయుండెను.

పదం సమాచారం:

  • Strong's: H2372, H2374, H4853, H5012, H5013, H5016, H5017, H5029, H5030, H5031, H5197, G2495, G4394, G4395, G4396, G4397, G4398, G5578