te_tw/bible/kt/fulfill.md

4.6 KiB

నెరవేర్చు, నెరవేర్చబడిన

నిర్వచనం:

"నెరవేర్చు" అంటే పూర్ణమైన రీతిలో అనుకున్నది దేన్నైనా సాధించడం.

  • ప్రవచనం నెరవేరినప్పుడు ప్రవచనం లో చెప్పిన ప్రకారం జరిగేలా దేవుడు చేస్తాడు.
  • ఒక వ్యక్తి వాగ్దానం లేక ఒట్టు, నెరవేర్చడం అంటే అతడు వాగ్దానం చేసిన దాని ప్రకారం చేశాడు.
  • బాధ్యత నెరవేర్చడం అంటే కేటాయించబడిన పనిని చేయడం.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "నెరవేర్చు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సాధించు” లేక “నెరవేర్పు” లేక “జరిగేలా చెయ్యడం” లేక “లోబడు” లేక “సాధించు."
  • "నెరవేరింది" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నిజమయింది” లేక “సంభవించింది” లేక “జరిగింది."
  • "నెరవేర్చు," అనే దాన్ని అనువదించడం. "నీ పరిచర్య నెరవేర్చు.” " "పరిపూర్ణముగా” లేక “జరిగించు” లేక “అభ్యసించు” లేక “దేవుడు దేనికి నిన్ను పిలిచాడో ఆ విధంగా ఇతరులకు సేవ."

(చూడండి: ప్రవక్త, క్రీస్తు, పరిచర్య చేసే వాడు, పిలుపు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 24:04 యోహాను ప్రవక్త పలికిన దాన్ని నెరవేర్చాడు, "చూడండి నా వార్తాహరుడిని నీ దారి సిద్ధం చెయ్యడానికి నీకు ముందుగా పంపుతున్నాను.”
  • 40:03 సైనికులు యేసు బట్టల కోసం చీట్లు వేశారు. అలా చెయ్యడంలో వారు దేవుని ప్రవచనం నెరవేర్చారు. "వారు నా వస్త్రాలు పంచుకున్నారు."
  • 42:07 యేసు చెప్పాడు, "నేను మీకు చెప్పాను. రాసి ఉన్న ప్రతిదీ తప్పక నెరవేరుతుంది."
  • 43:05 ప్రవక్త యోవేలు ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనం, “అంత్య దినాల్లో, నేను నా ఆత్మను కుమ్మరిస్తాను” అనేది నెరవేరుతుంది._'"
  • 43:07, 'నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్ళిపోనియ్యవు” అనే ప్రవచనం నెరవేరుతుంది.
  • 44:05 "మీరు చేస్తున్నది మీకు అర్థం కాకపోయినప్పటికీ దేవుడు మీ క్రియలు ఉపయోగించి మెస్సియా బాధలు పడి చనిపోతాడనే ప్రవచనాలు నెరవేరుస్తాడు.

పదం సమాచారం:

  • Strong's: H1214, H5487, G1096, G4138