te_tw/bible/kt/sign.md

5.6 KiB

సూచక క్రియ, సూచక క్రియలు, నిరూపణ, జ్ఞప్తి చేయుట

నిర్వచనము:

సూచక క్రియ అనునది ఒక విశేషమైన అర్థమును తెలియజేసే ఒక సంఘటన, ఒక విషయము, లేక ఒక క్రియయైయున్నది

  • “జ్ఞాపకాలు” అనేవి ప్రజలు కొన్నిటిని జ్ఞాపకము చేసికొనుటకు విశేషముగా అనేకమార్లు వాగ్ధానము చేయబడిన వాటినిగూర్చి జ్ఞాపకము చేసికొనుటకు సహాయము చేయుట ద్వారా ప్రజలకు “జ్ఞాపకము” చేసే సూచక క్రియలుయైయున్నవి.
  • దేవుడు ఆకాశములో సృష్టించిన ఇంద్రధనస్సు అనేది ఒక సూచక క్రియయైయున్నది, ఇది దేవుడు ఇంకెప్పటికీ ప్రపంచమంతటిని ప్రళయము ద్వారా మనుష్యులను నాశనము చేయనని చెప్పిన వాగ్ధానమును ప్రజలకు జ్ఞాపకము చేయుచున్నది.
  • దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికకు సూచనగా వారి కుమారులందరు సున్నతి చేయించుకోవాలని ఆయన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను.
  • సూచక క్రియలు దేనిని గూర్చియైన విషయాన్ని తెలియజేస్తాయి లేక దేనినిగూర్చియైన ఎత్తి చూపుతాయి.
  • బెత్లెహేములో జన్మించిన శిశువును మెస్సయ్యాగా ఎలా గుర్తించాలనే ఆనవాళ్ళను దూత గొర్రెల కాపరులకు తెలియజేసెను.
  • మత నాయకులు బంధించాలనుకున్న యేసును బంధించుటకు యూదా ఒక సూచనగా యేసు నుదుటిపైన ముద్దు పెట్టెను.
  • సూచక క్రియలు ఏదైనా ఒక విషయము నిజమని నిరూపిస్తాయి.
  • ప్రవక్తల ద్వారా మరియు అపొస్తలుల ద్వారా జరిగిన మహత్కార్యములన్నియు వారు మాట్లాడుచున్నది దేవుని సందేశమని నిరూపించే సూచక క్రియలైయుండెను.
  • యేసు చేసిన మహత్కార్యములన్నియు ఆయన నిజముగా మెస్సయ్యేనని నిరూపించిన సూచకక్రియలైయున్నవి.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా ‘సూచక క్రియ” అనే పదమును “సైగ” లేక “గురుతు” లేక “మార్కు” లేక “ఆధారము” లేక “నిరూపణ” లేక “సంజ్ఞ” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “చేతులతో సూచక క్రియలు చేయుట’ అనే ఈ మాటను “చేతులతో చేసే చలనము” లేక “చేతులతో చేసే సంజ్ఞ” లేక “సంజ్ఞలు చేయుము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • కొన్ని భాషలలో దేనినైనా నిరూపించే “సూచక క్రియ” కొరకు బహుశ ఒకే పదము ఉండిఉండవచ్చు మరియు “సూచకక్రియ” కొరకు ఇంకొక పదము మహత్కార్యము అని చెప్పవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: మహత్కార్యము, అపొస్తలుడు, క్రీస్తు, ఒడంబడిక, సున్నతి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H6161, H6725, H6734, H7560, G364, G880, G1213, G1229, G1718, G1730, G1732, G1770, G3902, G4102, G4591, G4592, G4953, G4973, G5280