te_tw/bible/kt/apostle.md

5.2 KiB

అపొస్తలుడు, అపొస్తలులు, అపొస్తలత్వం

నిర్వచనం:

“అపొస్తలులు” దేవుని గురించీ, అయన రాజ్యం గురించీ బోధించడానికి యేసు చేత పంపించబడిన మనుషులు. "అపొస్తలత్వం" పదం అపొస్తలులుగా ఎంపిక చెయ్యబడినవారి హోదానూ, అధికారాన్నీ సూచిస్తుంది.

  • ఈ పదం "అపొస్తలుడు"అంటే "ఎవరినైనా ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం పంపించబడడం" అని అర్థం. అపొస్తలుడు తనను పంపిన వ్యక్తికున్న అదే అధికారాన్ని కలిగి ఉన్నాడు.
  • యేసు పన్నెండుమంది అత్యంత సన్నిహితమైన శిష్యులు మొదటి అపొస్తలులు అయ్యారు. ఇతర మనుషులు, పౌలు, యాకోబు, తదితరులు కూడా అపొస్తలులు అయ్యారు.
  • దేవుని శక్తి చేత, అపొస్తలులు ధైర్యంగా సువార్త ప్రకటించడం, మరియు ప్రజల నుండి దయ్యాలను బయటకు వెళ్ళగొట్టడం చేయగలిగారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదం "అపొస్తలుడు" "బయటకు పంపించబడినవాడు" లేదా "పంపబడినవాడు" లేదా "బయటకు వెళ్ళడానికి పిలువబడిన వాడు మరియు దేవుని సందేశాన్ని ప్రజలకు బోధించేవ్యక్తి" అనే అర్ధాన్ని ఇచ్చే పదం లేక పదబంధంతో కూడా అనువదించవచ్చు.
  • "అపొస్తలుడు” మరియు “శిష్యుడు" పదాలను వివిధ రీతులలో అనువదించడం ప్రాముఖ్యం.
  • ఈ పదం స్థానిక లేక జాతీయ భాషలోని బైబిలు అనువాదంలో ఏవిధంగా అనువదించబడిందో కూడా పరిగణించండి.

(చూడండి తెలియని వాటిని అనువదించడం ఎలా)

(చూడండి: అధికారం, శిష్యుడు, యాకోబు (జెబెదయి కుమారుడు), పౌలు, పన్నెండు మంది)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 26:10 అప్పుడు యేసు పన్నెండు మందిని పిలిచి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. అపొస్తలులు యేసుతో ప్రయాణించారు, అయన నుండి నేర్చుకున్నారు.
  • 30:01 యేసు తన అపొస్తలులను అనేక వివిధ గ్రామాల్లో ప్రజలకు ప్రకటించడానికీ మరియు బోధించడానికీ పంపాడు.
  • 38:02 యూదా యేసు అపొస్తలులలో ఒకడు. అతడు తన అపొస్తలుల డబ్బు సంచికి బాధ్యత వహించాడు, అయితే అతడు డబ్బును ప్రేమించాడు. మరియు తరచుగా సంచి నుండి దొంగిలించే వాడు.
  • 43:13 శిష్యులు తమను అపొస్తలుల బోధ, సహవాసం, కలిసి తినడం, ప్రార్థనకు అప్పగించుకున్నారు.
  • 46:08 తరువాత బర్నబా అనే పేరు గల విశ్వాసి సౌలును అపొస్తలుల చెంతకు తీసుకుపోయి దమస్కులో సౌలు ఏ విధంగా సువార్తను ధైర్యంగా ప్రకటించాడో వారికి చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: G651, G652, G2491, G5376, G5570