te_tw/bible/names/paul.md

7.0 KiB

పౌలు, సౌలు

వాస్తవాలు:

పౌలు ఆదిమ సంఘానికి నాయకుడు, అనేక ఇతర ప్రజా గుంపులకు సువార్త ప్రకటించడానికి యేసు చేత పంపించబడినవాడు.

  • పౌలు రోమాలోని తార్సు పట్టణములో జన్మించిన యూదుడు. అందుచేత రోమా దేశ పౌరుడుగా ఉన్నాడు.
  • పౌలు ఆరంభంలో యూదా సంబంధ పేరు సౌలు అని పిలువబడ్డాడు.
  • సౌలు యూదుల మత నాయకుడు అయ్యాడు. క్రైస్తవులుగా మారిన యూదులను బంధించాడు, ఎందుకంటే వారు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు అగౌరవపరుస్తున్నారని అతడు తలంచాడు.
  • యేసు ప్రకాశమానమైన వెలుగు ద్వారా సౌలుకు తననుతాను బయలుపరచుకొన్నాడు, క్రైస్తవులను హింసించడం నిలిపివేయాలని చెప్పాడు.
  • సౌలు యేసునందు విశ్వాసముంచాడు. తన తోటి యూదులకు యేసును గురించి బోధించడం ఆరంభించాడు.
  • ఆ తరువాత, యేసును గురించి యుదేతరులకు ప్రకటించడానికి దేవుడు పౌలును పంపించాడు, రోమా సామ్రాజ్యంలోని అనేక పట్టణములలోనూ, ప్రాంతాలలోనూ సంఘాలను స్థాపించడం ఆరంభించాడు. ఈ సమయములో అతడు “పౌలు” అను రోమా పేరుతో పిలువబడ్డాడు.
  • ఈ పట్టణములలోనున్న సంఘాలలోని క్రైస్తవులను ప్రోత్సహించడానికీ, వారికి బోధించడానికీ పౌలు ఉత్తారాలు రాశాడు. వీటిలో అనేకం క్రొత్తనిబంధనలో ఉన్నాయి.

(అనువాదం సూచనలు: పేర్లను ఏవిధంగా అనువదించాలి)

(చూడండి: క్రైస్తవుడు, యూదు నాయకులు, రోమా)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 45:06 స్తెఫనును చంపిన ప్రజలతో సౌలు అనబడిన యౌవనస్తుడు ఏకీభవించాడు, వారు తన మీదకి రాళ్లు రువ్వుతున్నప్పుడు వారి వస్త్రాలకు కావలిగా ఉన్నాడు.
  • 46:01 సౌలు అను యవనస్థుడు స్తెఫనును చంపిన మనుష్యుల వస్త్రాలకు కావలి ఉన్నాడు, అతడు యేసునందు విశ్వాసం ఉంచలేదు. అందుచేత అతడు విశ్వాసులను హింసించాడు.
  • 46:02 సౌలు దమస్కు మార్గములో ప్రయాణము చేయుచున్నప్పుడు, ఆకాశమునుండి ప్రకాశమానమైన వెలుగు వచ్చి తన చుట్టూ కమ్ముకొంది. అప్పుడు అతడు క్రిందకి పడిపోయాడు, ఆ సమయములో సౌలా! సౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు అని ఒకరు చెప్పడం సౌలు విన్నాడు.
  • 46:05 అందుచేత అననీయ సౌలు వద్దకు వెళ్లి, అతని మీద తన చేతులను ఉంచాడు. “నీవు దారిలో వస్తున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన యేసు నన్ను నీ యొద్దకు పంపించెను, తద్వారా నీవు నీ చూపును పొందుకొని, పరిశుద్ధాత్మతో నింపబడుడువు” అని చెప్పాడు. వెనువెంటనే సౌలు చూడడం ఆరంభించాడు. అననియ అతనికి బాప్తిస్మం ఇచ్చాడు.
  • 46:06 ఆ క్షణమునుండే, సౌలు “యేసే దేవుని కుమారుడని” చెప్పుచూ దమస్కులోని యూదులందరికి ప్రకటించడం ఆరంభించాడు.
  • 46:09 బర్నబా మరియు సౌలు సంఘమును బలపరచుటకునూ, యేసును గురించి నూతన విశ్వాసులకు మరి యెక్కువగా బోధించడానికి అక్కడికి (అంతియొకయ) వెళ్ళారు.
  • 45:06 సౌలు రోమా సామ్రాజ్యమంతటి ద్వారా ప్రయాణించినప్పుడు తను “పౌలు” అనే రోమా పేరును ఉపయోగించాడు.
  • 45:06 పౌలు మరియు ఇతర క్రైస్తవ నాయకులు అనేక పట్టణములకు ప్రయాణము చేసి, యేసును గూర్చిన సువార్తను ప్రజలకు బోధించి, ప్రకటించారు.

పదం సమాచారం:

  • Strong's: G3972, G4569