te_tw/bible/kt/christian.md

5.5 KiB
Raw Permalink Blame History

క్రైస్తవుడు

నిర్వచనం:

యేసు పరలోకం వెళ్ళిపోయాక కొంత కాలం తరువాత, ప్రజలు "క్రైస్తవుడు" అనే పేరు కనిపెట్టారు. అంటే, "క్రీస్తును అనుసరించే వాడు."

  • అంతియొకయలో యేసు అనుచరులను మొదటిగా "క్రైస్తవులు"అని పిలిచారు.
  • క్రైస్తవుడు అంటే యేసు దేవుని కుమారుడు అని విశ్వసించే మనిషి. యేసు తన పాపాలనుండి తనను రక్షించేవాడు అని నమ్మకముంచే వాడు.
  • మన ఆధునిక సమయాల్లో, తరచుగా "క్రైస్తవుడు"అనే పదాన్ని క్రైస్తవ మతం అవలంబించిన వారికి ఉపయోగిస్తారు, అలాటివారు నిజంగా యేసును అనుసరించక పోయినా సరే. "క్రైస్తవుడు"అనే దానికి బైబిల్లో అర్థం ఇది కాదు.
  • ఎందుకంటే ఈ పదం "క్రైస్తవుడు"అనేది బైబిల్లో ఎప్పుడైనా నిజంగా యేసును విశ్వసించిన వారికి చెందుతుంది. క్రైస్తవుడు అంటే "విశ్వాసి"అని కూడా పిలుస్తారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "క్రీస్తు-అనుచరుడు” లేక “క్రీస్తును వెంబడించే వాడు"లేక "క్రీస్తు-మనిషి."
  • ఈ పదాన్ని అనువదించేటప్పుడు ఆ అనువాదంలో వివిధ రకాల పదాలు ఉపయోగిస్తారు- శిష్యుడు లేక అపోస్తలుడు.
  • ఈ పదాన్ని అనువదించడంలో యేసును విశ్వసించిన ప్రతి ఒక్కరూ అనే భావం వచ్చేలా జాగ్రత్త పడాలి. కేవలం కొన్ని సమూహాలు మాత్రమే కాదు.
  • ఈ పదాన్ని బైబిల్ అనువాదంలో స్థానిక, జాతీయ భాషలో ఎలా అనువదించ వచ్చు చూడండి.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: అంతియొకయ, క్రీస్తు, సంఘం, శిష్యుడు, విశ్వసించు, యేసు, దేవుని కుమారుడు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 46:09 అంతియొకయలో విశ్వాసులను మొదటగా "క్రైస్తవులు” అని పిలిచారు.
  • 47:14 పౌలు, ఇతర క్రైస్తవ నాయకులు అనేక పట్టణాల్లో యేసును గురించి సువార్త ప్రకటిస్తూ ప్రజలకు బోధిస్తూ ప్రయాణించారు.
  • 49:15 నీవు యేసును విశ్వసిస్తే అయన మీకోసం చేసినది గ్రహిస్తే నీవు క్రైస్తవుడు!
  • 49:16 నీవు క్రైస్తవుడు అయితే, యేసు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు నీ పాపాలు క్షమించాడు.
  • 49:17 నీవొక క్రైస్తవుడు అయినప్పటికీ, పాపం చేసే శోధన నీకు ఉంటుంది.
  • 50:03 పరలోకానికి తిరిగి వెళ్ళక ముందు సువార్త వినని మనుషులకు వినిపించాలని యేసు క్రైస్తవులు చెప్పాడు.
  • 50:11 యేసు తిరిగి వచ్చినప్పుడు చనిపోయిన ప్రతి క్రైస్తవుడు తిరిగి బ్రతికి ఆకాశంలో ఆయన్ను కలుస్తారు.

పదం సమాచారం:

  • Strong's: G5546