te_tw/bible/names/antioch.md

2.8 KiB

అంతియొకయ

వాస్తవాలు:

కొత్త నిబంధనలో అంతియొకయ అనే రెండు పట్టణాలు ఉన్నాయి. ఒకటి సిరియాలో మధ్యదరా సముద్రం తీరాన ఉంది. మరొకటి రోమా పిసిదియ పరగణాలో, కొలోస్సయి పట్టణం దగ్గర ఉంది.

  • సిరియాలోని అంతియొకయలోని స్థానిక సంఘం యేసు విశ్వాసులను "క్రైస్తవులు" అని పిలిచిన మొదటి ప్రాంతం. అక్కడి సంఘం యూదేతరులకు బోధించడానికి మిషనెరీలను పంపించిన సంఘం.
  • యెరూషలేము సంఘ నాయకులు అంతియొకయ విశ్వాసులకు ఒక ఉత్తరం పంపించారు. క్రైస్తవులుగా ఉండాలంటే వారు యూదు చట్టాలు పాటించనక్కర లేదని అందులో రాశారు.
  • పౌలు, బర్నబా, యోహాను మార్కు పిసిదియ అంతియొకయకు సువార్త ప్రకటనకై ప్రయాణించారు. కొందరు యూదులు ఇతర పట్టణాలనుండి వచ్చి జగడం రేపారు. వారు పౌలును చంపడానికి ప్రయత్నించారు. అయితే అనేక ఇతర ప్రజలు యూదులు, యూదేతరులుకూడా, బోధను విన్నారు, యేసును విశ్వసించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:బర్నబా, కొలోస్సయి, యోహాను మార్కు, పౌలు, పరగణా, రోమ్, సిరియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G491