te_tw/bible/names/barnabas.md

3.5 KiB

బర్నబా

వాస్తవాలు:

బర్నబా అపోస్తలులు కాలంలో నివసించిన ఆది క్రైస్తవుల్లో ఒకడు.

  • బర్నబా ఇశ్రాయేలు లేవీ గోత్రం వాడు. సైప్రస్ దేశస్థుడు.
  • సౌలు (పౌలు) క్రైస్తవుడుగా మారినప్పుడు, అతన్ని సాటి విశ్వాసిగా అంగీకరించమని బర్నబా ఇతర విశ్వాసులను కోరాడు.
  • బర్నబా, పౌలు యేసును గురించి వివిధ పట్టణాల్లో సువార్త ప్రకటించడానికి కలిసి ప్రయాణించారు.
  • అతని పేరు యోసేపు, అయితే అతనికి "బర్నబా," అని పేరు పెట్టారు. అంటే "ప్రోత్సాహ పుత్రుడు."

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: క్రైస్తవుడు, సైప్రస్, మంచి వార్త, లేవీయుడు, పౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 46:08 తరువాత బర్నబా అనే పేరు గల విశ్వాసి సౌలును అపోస్తలుల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. సౌలు ఏ విధంగా ధైర్యంగా దమస్కులో సువార్త బోధించాడో వారికి చెప్పాడు.
  • 46:09 బర్నబా, సౌలు ఈ కొత్త విశ్వాసులకు యేసును గురించి బోధించడానికి, సంఘాన్ని బలపరచడానికి అక్కడికి వెళ్లారు.
  • 46:10 ఒక రోజు అంతియొకయలో క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే, పరిశుద్ధాత్మవారితో చెప్పాడు, "నాకోసం బర్నబా సౌలులను నేను వారిని పిలిచిన పని కోసం ప్రత్యేకపరచండి." కాబట్టి అంతియొకయలో సంఘం బర్నబా, సౌలు కోసం ప్రార్థించారు, వారిపై చేతులు ఉంచారు.

పదం సమాచారం:

  • Strong's: G921