te_tw/bible/kt/goodnews.md

5.6 KiB

మంచి వార్త, సువార్త

నిర్వచనం:

"సువార్త" అక్షరాలా దీని అర్థం "మంచి వార్త." ఇది మనుషులకు మేలు చేసే, సంతోషపెట్టే సందేశం లేక ప్రకటన.

  • బైబిల్లో, ఈ పదం సాధారణంగా సిలువపై యేసు బలి అర్పణ మూలంగా ప్రజలకు దేవుని రక్షణను సూచిస్తున్నది.
  • అనేక ఇంగ్లీషు బైబిళ్ళలో, "మంచి వార్త" ను సాధారణంగా అనువదించ వచ్చు "సువార్త"గా అనువదించారు. "యేసు క్రీస్తు సువార్త" "దేవుని సువార్త" "రాజ్య సువార్త" వంటి పడబంధాల్లో ఉపయోగించారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని రకరకాలుగా అనువదించవచ్చు. "మంచి సందేశం” లేక “మంచి ప్రకటన ” లేక “దేవుని రక్షణ సందేశం” లేక “దేవుడు యేసును గురించి బోధించిన విషయాలు."
  • సందర్భాన్ని బట్టి, దీన్ని అనువదించడం, "ఒక దాని గురించి మంచి వార్త/సందేశం” లేక “మంచి సందేశం నుండి” లేక “దేవుడు మనకు చెప్పిన మంచి మేళ్ళు” లేక “దేవుడు తాను మనుషులను రక్షించే విధానం గురించి చెప్పిన మాటలు."

(చూడండి: రాజ్యం, బలి అర్పణ, రక్షించు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 23:06 దేవదూత చెప్పాడు, "భయపడకండి, ఎందుకంటే మంచి వార్త మీకోసం తెచ్చాను. మెస్సియా, ప్రభువు బెత్లెహేములో పుట్టాడు!"
  • 26:03 యేసు చదివాడు, "దేవుడు నాకు తన ఆత్మ ఇచ్చాడు. పేదలకు సువార్త, ఖైదీలకు స్వాతంత్ర్యం, గుడ్డి వారికి చూపు, బాధితులకు విడుదల ప్రభువు అనుగ్రహ వత్సరం గురించిన మంచి వార్త ప్రకటించాడు.
  • 45:10 ఫిలిప్పు యేసు సువార్తను గురించి ఇతర లేఖనాల సహాయంతో వివరించాడు.
  • 46:10 తరువాత యేసును గురించిన సువార్త అనేక ఇతర స్థలాల్లో ప్రకటించడం కోసం పంపించాడు.
  • 47:01 ఒక రోజు , పౌలు తన స్నేహితుడు సీల ఫిలిప్పిపట్టణంలో యేసును గురించి సువార్త ప్రకటించారు.
  • 47:13 సువార్త యేసును గురించిన సువార్త వ్యాపించ సాగింది. సంఘం ఎదుగుతూ ఉంది.
  • 50:01 దాదాపు 2,000 సంవత్సరాలుగా లోకవ్యాప్తంగా ప్రజలెందరో మెస్సియా అయిన యేసును గురించిన సువార్త వింటున్నారు.
  • 50:02 యేసు భూమిపై ఉన్నప్పుడు ఇలా చెప్పాడు, "నా శిష్యులు దేవుని రాజ్యం గురించిన మంచి వార్త లోకంలో అన్ని చోట్లా, మనుషులకు ప్రకటిస్తారు. ఆ తరువాత అంతం వస్తుంది."
  • 50:03 అయన పరలోకానికి తిరిగి వెళ్లకముందు అంతకు ముందు ఎన్నడూ వినని వారికి క్రైస్తవులు సువార్త ప్రకటించాలని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: G2097, G2098, G4283