te_tw/bible/other/sacrifice.md

10 KiB

బలియాగము, బలియాగములు, బలియర్పించబడెను, బలియర్పించుట, అర్పణ, అర్పణలు

నిర్వచనము:

పరిశుద్ధ గ్రంథములో “బలియాగము” మరియు “అర్పణ” అనే ఈ రెండు పదములు దేవునిని ఆరాధన చేయు క్రియగా దేవునికి ఇచ్చే ప్రత్యేకమైన బహుమానములను సూచించును. ప్రజలు కూడా అనేక అబద్దపు దేవుళ్ళకు అర్పణలను అర్పించెదరు.

  • “అర్పణ” అనే ఈ పదము సాధారణముగా అర్పించబడిన లేక ఇవ్వబడిన వాటిని సూచిస్తుంది. “బలియాగము” అనే ఈ మాట ఇచ్చే వ్యక్తికి గొప్పదైన రీతిలో చేయబడిన దేనినైనా లేక ఇవ్వబడిన దేనినైనా సూచిస్తుంది.
  • దేవునికి అర్పించే అర్పణలు ప్రత్యేకమైనవి, ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవునికి విధేయత మరియు ఆరాధన భావనను వ్యక్తపరచుకొనుటకు అర్పణలు అర్పించమని ఆయన వారికి ఆజ్ఞాపించియున్నాడు.
  • అనేక విధములైన అర్పణల పేర్లు ఏవనగా, “దహనబలి” మరియు “సమాధానబలి”, ఎటువంటి అర్పణ అర్పించబడియున్నదని సూచించబడియున్నది.
  • దేవునికి అర్పించే బలియాగములన్నిటిలో అనేకమార్లు ప్రాణిని బలియర్పించుట కూడా ఉండును.
  • యేసు బలియాగము మాత్రమె, దేవుని పరిపూర్ణమైన పాపరహితమైన తన కుమారుడు మాత్రమె ప్రజల పాపమునుండి సంపూర్ణముగా కడిగివేయును, మరి ఇక ఏ ప్రాణియు పాపములను కడిగివేయజాలదు.
  • “సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకో” అనే అలంకారిక వాక్యమునకు అర్థము ఏమనగా, “దేవునికి సంపూర్ణ విధేయతలో నీ జీవితమును జీవించు, ఆయనను సేవించుటలో సమస్తమును ఆయనకు సమర్పించు” అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • “అర్పించుట” అనే ఈ పదమును “దేవునికి ఇచ్చే కానుక” అని లేక “దేవునికి ఇవ్వబడిన ఏదైనా” లేక “దేవునికి సమర్పించిన ఏదైనా విలువైనది” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్బానుసారముగా, “బలియాగము” అనే ఈ మాట “ఆరాధనలో ఇచ్చే విలువైనది” లేక “ఒక ప్రత్యేకమైన ప్రాణిని బలి అర్పించి, దేవునికి సమర్పించేది” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “బలియాగమునకు” క్రియను “విలువైనదానిని సమర్పించుకొనుట” లేక “ఒక ప్రాణిని బలియిచ్చి, దానిని దేవునికి అర్పించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “సజీవయాగముగా నిన్ను నీవు సమర్పించుకొనుట” అనే ఈ మాటను అనువాదము చేయు వేరొక విధానములో “నీ జీవితమును జీవించుచున్నప్పుడు, బలిపీఠము మీద అర్పించబడిన ప్రాణివలె (లేక జంతువువలె) దేవునికి నిన్ను నీవు సంపూర్ణముగా సమర్పించుకొనుము.

(ఈ పదములను కూడా చూడండి: బలిపీఠం, దహనబలి, పానార్పణ, తప్పుడు దేవుడు, సహవాస అర్పణ, స్వచిత్త అర్పణ, సమాధాన బలి, యాజకుడు, పాప పరిహారార్ధ బలి, ఆరాధన)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 03:14 నోవహు నావనుండి దిగిన తరువాత, ఆయన ఒక దహన బలిపీఠమును కట్టి, బలియాగమునకు అర్పించుటకు ఉపయోగించే ప్రతియొక్క ప్రాణిని అర్పించెను. దేవుడు బలియాగముతో చాలా సంతోషముగా ఉండెను మరియు నోవహును, అతని కుటుంబమును ఆశీర్వదించెను.
  • 05:06 “నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇసాకును తీసుకొని, అతనిని నాకు బలియాగముగా సమర్పించుము.” మరలా అబ్రాహాము దేవునికి విధేయత చూపెను మరియు తన కుమారుని బలి ఇచ్చుటకు సిద్ధపడెను.
  • 05:09 ఇస్సాకుకు బదులుగా బలియిచ్చుటకు దేవుడు ఒక గొర్రెను అనుగ్రహించెను.
  • 13:09 దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపే వారందరూ దేవునికి బలియర్పణగా ప్రత్యక్షపు గుడారపు ద్వారము వద్దకు ఒక ప్రాణిని తీసుకొని రావలెయును. యాజకుడు ఆ ప్రాణిని వధించి, దహన బలిపీఠము మీద కాల్చివేయును. బలియర్పించబడిన ప్రాణి యొక్క రక్తము బలియిచ్చిన వ్యక్తియొక్క పాపమును కప్పును మరియు దేవుని దృష్టిలో ఆ వ్యక్తిని కడిగివేయును.
  • 17:06 ఇశ్రాయేలీయులందరూ దేవునిని ఆరాధించి, ఆయనకు బలులు అర్పించుటకు అనువుగా ఉండుటకు మందిరమును కట్టాలని దావీదు కాంక్షించెను.
  • 48:06 యేసు ప్రధాన యాజకుడైయున్నాడు. ఇతర యాజకులవలె కాకుండా, ఈయన తన్ను తాను బలిగా అర్పించుకొనెను, తద్వారా లోకములోని సకల ప్రజల పాపములను తీసివేయును.
  • 48:08 మన స్థానములో చనిపోవుటకు బలిగా దేవుని గొర్రెపిల్లయైన యేసును దేవుడు అనుగ్రహించియున్నాడు.
  • 49:11 ఎందుకంటే యేసు తన్నుతాను అర్పించుకొనెను , దేవుడు ఎటువంటి పాపమునైనా, ఎటువంటి ఘోర పాపములనైనా క్షమించును.

పదం సమాచారం:

  • Strong's: H801, H817, H819, H1685, H1890, H1974, H2076, H2077, H2281, H2282, H2398, H2401, H2402, H2403, H2409, H3632, H4394, H4469, H4503, H4504, H5066, H5068, H5069, H5071, H5257, H5258, H5261, H5262, H5927, H5928, H5930, H6453, H6944, H6999, H7133, H7311, H8002, H8426, H8548, H8573, H8641, G266, G334, G1049, G1435, G1494, G2378, G2380, G3646, G4376, G5485