te_tw/bible/other/sinoffering.md

2.5 KiB

పాప పరిహారార్ధ బలి, పాప పరిహారార్థ బలులు

నిర్వచనము:

“పాప పరిహారార్థ బలి” అనేది దేవుడు ఇశ్రాయేలీయులకు అర్పించమని చెప్పిన ఏడు బలులలో ఒకటైయున్నది.

  • ఈ బలిలో ఎద్దును వధించేవారు, దాని రక్తమును మరియు క్రొవ్వును తీసుకొని దహనబలి పీఠము మీద ఉంచి కాల్చెదరు, మరియు మిగిలిన మాంసమును ఇశ్రాయేలీయుల శిబిరమునకు వెలుపల నేల మీద కాల్చేవారు.
  • ఈ ప్రాణిని సంపూర్ణముగా కాల్చుట ద్వారా దేవుడు ఎంత పరిశుద్ధుడో మరియు పాపము ఎంత భయంకరమైనదోనన్న విషయాన్ని తెలియజేస్తుంది.
  • పాపమును శుద్ధి చేయు క్రమములో చేయబడిన పాపము కొరకు రక్తమును తప్పకుండ చిందించబడవలసియుండెను.
  • ప్రాణుల బలులు శాశ్వతముగా పాప క్షమాపణను కలుగజేయవు.
  • సిలువలో యేసు మరణము శాశ్వతముగా పాపమునకు క్రయధనము చెల్లించెను. ఆయనే పరిపూర్ణమైన పాప పరిహారార్థబలి.

(ఈ పదములను కూడా చూడండి: బలిపీఠం, ఆవు, క్షమించు, బలియర్పణ, పాపము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2401, H2402, H2398, H2403