11 KiB
11 KiB
పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం
నిర్వచనం:
“పాపం” అనే పదం దేవుని చిత్తానికీ, ధర్మాలకూ విరుద్ధముగా చేసే చర్యలనూ, ఆలోచనలనూ, మాటలనూ సూచిస్తుంది. దేవుడు మనలను చేయమని కోరినదానిని చెయ్యకుండా ఉండడం అని కూడా ఈ పదం సూచిస్తుంది.
- దేవునికి లోబడకుండా ఉండే పనులూ లేదా దేవుణ్ణి సంతోషపరచకుండా ఉంచే పనులు, ఇతర ప్రజలకు తెలియ విషయాలు సహితం ఏమైనా అవి పాపం అని పరిగణించబడుతాయి
- దేవుని చ్తితానికి విరుద్ధమైన ఆలోచనలూ, క్రియలూ “పాపభూయిష్టమైనవి.”
- ఆదాము పాపము చేసినందున సమస్త మనుష్యులందరూ “పాప స్వభావంతో” పుట్టారు. ఆ స్వభావం వారిని నియంత్రించి, వారు పాపము చేయడానికి కారణం అవుతుంది.
- “పాపి” అంటే పాపాలు చేసే వ్యక్తి అని అర్థం. అందుచేత ప్రతీ మనుష్యుడు పాపియైయున్నాడు.
- కొన్నిమార్లు “పాపులు” అనే పదం ధర్మశాస్త్రమునకు లోబడని ప్రజలనూ, తాము భావించిన ప్రజలనూ సూచించడానికి పరిసయ్యుల వంటి మతసంబంధమైనవారి చేత ఉపయోగించబడింది.
- “పాపి” అనే పదం ఇతర ప్రజలకంటే అతి హీనమైన ప్రజల కోసం కూడా ఉపయోగించబడింది. ఉదాహరణకు, ఈ బిరుదు ఎక్కువగా సుంకం వసూలు చేసేవారికీ, వ్యభిచారులలూ ఇవ్వబడింది.
అనువాదం సూచనలు:
- “పాపం” అనే పదం “దేవునికి అవిధేయత” లేదా “దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం" లేదా "దుష్టప్రవర్తన, దుష్టతలంపులు" లేదా "చెడు క్రియలు" అని అనువదించబడవచ్చు.
- “పాపం" పదం “దేవునికి అవిధేయత” లేదా “తప్పు చేయడం” అని కూడా అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, “పాపభూయిష్టమైన” అనే పదం “పూర్తిగా చెడు చెయ్యడం" లేదా "దుష్టత్వం" లేదా చేయుట” లేక “దుష్టత్వము” లేక “అనైతికత” లేక “చెడు” లేక “దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి “పాపి” అనే పదం “పాపములు చేయు వ్యక్తి” లేదా “తప్పులు చేయు వ్యక్తి” లేదా "దేవుని అవిధేయత చూపించే వ్యక్తి” లేదా “ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకొనే వ్యక్తి” అని అర్థం వచ్చే వాక్యాలతో గాని లేదా పదాలతోగానీ అనువదించబడవచ్చు.
- “పాపులు” అనే పదం “అత్యంత పాపాత్ములైన ప్రజలు” లేదా “పాపాత్ములుగా పరిగణించబడిన ప్రజలు” లేదా “అనైతిక ప్రజలు” అనే అర్థం వచ్చే వాక్యాలతో గానీ లేదా పదాలతోగానీ అనువదించబడవచ్చు.
- “సుంకం వసూలు చేసేవారు, పాపులు" పదం అనువాదంలో “ప్రభుత్వం కోసం డబ్బును పోగుచేసేవారు, పాపాత్ములైన ఇతర ప్రజలు" లేదా అత్యంత పాపాత్ములైన ప్రజలు, సుంకం వసూలు చేసేవారు సహితం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- ఈ పదం అనువాదంలో పాప సంబంధమైన ప్రవర్తన, ఆలోచనలూ, ఇతర వ్యక్తులు చూడని, లేదా యెరుగని సంగతులను గురించి కూడా తెలియచేసేవిధంగా ఉండేలా చూడండి.
- “పాపం” పదం సాధారముగా ఉండాలి, "దుష్టత్వం," "చెడు” అనే పదాలకు భిన్భినంగా ఉండాలి.
(చూడండి: అవిధేయత, చెడు, శరీరము, సుంకం వసూలు చేసేవాడు)
బైబిలు రిఫరెన్సులు:
- 1 దిన. 09:1-3
- 1 యోహాను 01:10
- 1 యోహాను 02:02
- 2 సమూయేలు 07:12-14
- అపొ.కా. 03:19
- దానియేలు 09:24
- ఆది. 04:07
- హెబ్రీ 12:02
- యెషయా 53:11
- యిర్మియా 18:23
- లేవి. 04:14
- లూకా 15:18
- మత్తయి 12:31
- రోమా 06:23
- రోమా 08:04
బైబిలు కథలనుండి ఉదాహరణలు:
- 03:15 “ప్రజలు పాపపు క్రియలు చేయుటనుబట్టి నేను ఇక ఎన్నటికి నేలను శపించను, లేక ప్రజలు పాపాత్ములుగా ఉన్నప్పటికీ ప్రళయము చేత వారిని నాశనం చేయను అని వాగ్దానము చేయుచున్నాను” అని దేవుడు చెప్పాడు.
- 13:12 వారు పాపము చేసినందున, దేవుడు వారి విషయమై చాలా కోపపడి, వారిని నాశనము చేయాలని ప్రణాళిక చేశాడు.
- 21:01 ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యములు దేవునికి విరుద్ధముగా పాపము చేసియున్నాయి. దేవుడు సీనాయి వద్ద ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను వారు ఉల్లంఘించారు.
- 21:13 మెస్సీయ పరిపూర్ణుడైయుండును, ఆయనయందు ఎటువంటి పాపము ఉండదని అని ప్రవక్తలు కూడా చెప్పారు. ఆయన ప్రజల పాపాల కొరకై శిక్షను భరించడానికి చనిపోయాడు.
- 35:01 ఒక రోజున యేసు అనేక సుంకపు గుత్తాదారులకు మరియు ఆయన బోధను వినడానికి వచ్చిన అనేకమంది పాపులకు బోధించుచుండెను.
- 38:05 యేసు గిన్నె ఎత్తికొని, “దీనిని త్రాగుడి. ఇది పాపముల నిమిత్తమై క్షమాపణ కొరకు చిందించబడే క్రొత్త నిబంధన సంబంధమైన నా రక్తమైయున్నది” అని చెప్పాడు.
- 43:11 “మీలో ప్రతియొక్కరు పశ్చాత్తాపపడి, యేసు నామమున బాప్తిస్మము పొందవలెను, తద్వారా దేవుడు మీ పాపములను క్షమించును” అని పేతురు వారికి జవాబిచ్చాడు.
- 48:08 మన పాపముల కొరకు మనమందరము చనిపోవలసినవారమైయున్నాము!
- 49:17 మీరు క్రైస్తవులైనప్పటికి, మీరు పాపము చేయడానికి మీరు శోదించబడతారు. అయితే దేవుడు నమ్మదగినవాడు మరియు మీరు మీ పాపములను ఒప్పుకొనినట్లయితే, ఆయన మిమ్మును క్షమించును. మీరు పాపానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆయన మీకు బలమును ఇచ్చును.
పదం సమాచారం:
- Strong's: H817, H819, H2398, H2399, H2400, H2401, H2402, H2403, H2408, H2409, H5771, H6588, H7683, H7686, G264, G265, G266, G268, G361, G3781, G3900, G4258