te_tw/bible/other/tax.md

7.7 KiB

పన్ను, పన్నులు, పన్నువేయడం, పన్నువిధించు, పన్నులెక్కలు, పన్ను చెల్లించేవారు, వసూలుదారుడు, పన్ను వసూలుదారులు,

నిర్వచనం:

"పన్ను” “పన్నులు" అనే పదాలు ప్రజలు తమ ప్రభుత్వానికి, లేక తమ అధికారులకు చెల్లించే డబ్బు లేక సరుకులను సూచిస్తాయి. "పన్ను వసూలుదారుడు" అంటే ప్రభుత్వ ఉద్యోగి. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించ వలసిన పన్నులను సేకరించడం వీరి పని.

  • ఎంత డబ్బు పన్నుగా చెల్లించాలి అనేది సాధారణంగా ఆ వ్యక్తి దగ్గర ఎంత విలువైన వస్తువులు, లేక ఎన్ని వ్యక్తిగతమైన ఆస్తులు ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
  • యేసు, అపోస్తలుల కాలంలో రోమా సామ్రాజ్యంలో నివసించే వారంతా యూదులతో సహా రోమా ప్రభుత్వానికి పన్నులు చెల్లించవలసి వచ్చేది.
  • పన్నులు కట్టకపోతే అలాటి వారు చెల్లించే వరకూ వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకుంటుంది.
  • రోమాసామ్రాజ్యంలో నివసించే ప్రతి ఒక్కరూ పన్నులు కట్టాలి గనక రాజ్య జనసంఖ్య లెక్కిస్తున్న సందర్భంలో యోసేపు, మరియలు బెత్లెహేముకు ప్రయాణించారు.
  • దీన్ని "సుంకం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు., "తప్పనిసరి చెల్లింపు” లేక “ప్రభుత్వం డబ్బు” లేక “ఆలయం డబ్బు," అని సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు.
  • "పన్నులు కట్టడం" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ప్రభుత్వానికి డబ్బు చెల్లించడం” లేక “ప్రభుత్వం పక్షంగా డబ్బు పుచ్చుకోవడం” లేక “చెల్లించవలసిన దాన్ని జమ చేయడం." "పన్నులు వసూలు " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రభుత్వం పక్షంగా డబ్బు వసూలు చేయడం.”
  • "పన్ను వసూలుదారుడు" అంటే ప్రజలు చెల్లించవలసిన డబ్బును ప్రభుత్వం పక్షాన వసూలు చేసే వాడు.
  • రోమా ప్రభుత్వం పక్షాన పన్నులు వసూలు చేసే వారు ఉన్నదానికంటే తరచుగా ప్రజలనుండి అధికారికంగా ఎక్కువ డబ్బు గుంజేవారు. పన్ను వసూలుదారులు అదనంగా వసూలు చేసిన మొత్తం తమకు ఉంచుకునేవారు.
  • పన్ను వసూలుదారులు ఈ విధంగా ప్రజలను మోసగించేవారు గనక యూదులు వీరిని పాపుల్లో అత్యంత హేయమైన వారినిగా చూసేవారు.
  • యూదులు ఈ వసూలుదారులను దేశ ద్రోహులుగా ఎంచే వారు. ఎందుకంటే వారు యూదులను పీడించే రోమా ప్రభుత్వం కింద పనిచేసేవారు.
  • "పన్ను వసూలుదారులు, పాపులు" అనే మాట కొత్త నిబంధనలో సర్వ సాధారణం. యూదులు ఈ పన్ను వసూలుదారులను ఎంతగా ద్వేషించేవారో దీన్ని బట్టి తెలుస్తున్నది.

(చూడండి: యూదుడు, రోమ్, పాపం)

బైబిల్ రిఫరెన్సులు

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

34:06 అతడు చెప్పాడు, "ఇద్దరు మనుషులు ఆలయానికి ప్రార్థించడం కోసం వెళ్లారు. వారిలో ఒకడు పన్ను వసూలుదారుడు, మరొకడు మతనాయకుడు." 34:07 " మతనాయకుడు ఇలా ప్రార్థించారు, 'దేవా నేను ఇతరుల వలె, అంటే దోపిడీ దొంగలు, అన్యాయం చేసే వారు, వ్యభిచారులు, లేక ఈ పన్ను వసూలుదారుడు వలె పాపిని కాను గనక నీకు కృతజ్ఞతలు.'" 34:09 "అయితేపన్ను వసూలుదారుడు మతాధిపతికి దూరంగా నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తి చూసే ధైర్యం లేక నిలిచి ఉన్నాడు. అతడు తన రొమ్ము కొట్టుకుంటూ ఇలా ప్రార్థించారు, 'దేవా దయచేసి నన్ను కరుణించు. ఎందుకంటే నేను పాపిని.'" 34:10 తరువాత యేసు చెప్పాడు, "నిజం చెబుతున్నాను, దేవుడు పన్ను వసూలుదారుడు చేసిన ప్రార్థన విని అతణ్ణి న్యాయవంతుడుగా ప్రకటించాడు." 35:01 ఒక రోజు, యేసు బోధిస్తుండగా అనేకమంది పన్ను వసూలుదారులు, ఇతర పాపులు సమకూడి వింటున్నారు.

పదం సమాచారం:

  • Tax Collector: Strong's: H5065, H5674, G5057, G5058