te_tw/bible/kt/flesh.md

5.1 KiB

శరీరం

నిర్వచనం:

బైబిల్లో, "శరీరం" అంటే అక్షరాలా మెత్తని కణజాలంతో ఉండే మానవ లేక జంతు భౌతికశరీరం.

  • బైబిల్ "శరీరం" అనే దాన్ని అలంకారికంగా కూడా అందరు మానవులను, లేక ప్రాణులను చెప్పడానికి ఉపయోగించింది.
  • కొత్త నిబంధనలో, "శరీరం" అనే మాటను మానవుల పాపపూరితమైన స్వభావం గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. వారి ఆత్మ సంబంధమైన స్వభావానికి భిన్నమైన అంశాన్ని చెప్పడానికి ఈ మాటను తరచుగా ఉపయోగిస్తారు.
  • "స్వంత రక్తమాంసాలు" అనే మాటను ఎవరైనా శారీరికంగా మరొకవ్యక్తితో బంధుత్వం ఉన్న, అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, మనవలు మెదలైన వారిని సూచించడానికి ఉపయోగిస్తారు.
  • "రక్తమాంసాలు" అనే దాన్ని ఒక వ్యక్తి పూర్వీకులు, లేక సంతానం అని తర్జుమా చెయ్యవచ్చు.
  • "ఒక శరీరం" అనే మాట శారీరికంగా ఒక పురుషుడు, స్త్రీ వివాహం ద్వారా కలవడాన్ని సూచించడానికి కూడా వాడతారు.

అనువాదం సలహాలు:

  • జంతువుల శరీరం చెప్పిన సందర్భంలో "శరీరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ”శరీరం” లేక “చర్మం” లేక “మాంసం."
  • సాధారణంగా ప్రాణులు అందరికీ కలిపి ఉపయోగించినప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "జీవులు” లేక “ప్రాణమున్న ప్రతిదీ."
  • సాధారణంగా ప్రజలు అందరి గురించీ చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రజలు” లేక “మానవులు” లేక “జీవిస్తున్న ప్రతి ఒక్కరూ."
  • "రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "బంధువులు” లేక “కుటుంబం” లేక “చుట్టాలు” లేక “కుటుంబం తెగ." కొన్ని సందర్భాల్లో ఇలా తర్జుమా చెయ్యవచ్చు"పూర్వీకులు” లేక “సంతానం."
  • కొన్ని భాషల్లో ఈ మాట ఒకే విధమైన అర్థం ఉండవచ్చు "రక్తమాంసాలు."
  • "ఒకే శరీరం అవుతారు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "లైంగికంగా ఏకం కావడం” లేక “ఏక శరీరం ” లేక “శరీరంలో ఆత్మలో ఏకం కావడం." ఈ మాట అనువాదం మీ భాష, సంస్కృతిలో అంగీకారయోగ్యంగా ఉందో లేదో చూసుకోండి. (చూడండి: సభ్యోక్తి) దీన్ని అలంకారికంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక పురుషుడు, ఒక స్త్రీ "ఏక శరీరం" కావడం కాకుండా అక్షరాలా ఒక వ్యక్తి అయిపోవడం.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H829, H1320, H1321, H2878, H3894, H4207, H7607, H7683, G2907, G4559, G4560, G4561