te_tw/bible/kt/evil.md

7.2 KiB

దుష్టత్వం, దుర్మార్గుడు, భ్రష్టమైన

నిర్వచనం:

బైబిలులో "దుష్టత్వం” పదం నైతిక దుష్టత్వాన్ని లేక భావోద్రేక భ్రష్టత్వాన్ని గురించిన భావాన్ని సూచిస్తుంది. పదం ఉపయోగించబడిన నిర్దిష్ట సమయంలో ఉద్దేశించబడిన అర్థాన్ని ఆ సందర్భం సాధారణంగా తెలియపరుస్తుంది.

  • "దుష్టత్వం" అనేది వ్యక్తి గుణ లక్షణాల గురించి తెలియపరుస్తుంది, అయితే, "దుర్మార్గం" అనేది ఒక వ్యక్తి ప్రవర్తన గురించి వివరిస్తుంది. అయితే, రెండు పదాలకు ఒకే విధమైన అర్థం ఉంది.
  • "దుర్మార్గత" పదం మనుషులు చెడు కార్యాలు చేస్తున్నప్పుడు ఉన్న స్థితిని సూచిస్తుంది.
  • దుష్టత్వం ఫలితాలు ఇతరులను హత్య చేయడం, దొంగతనం, దుర్భాషలు, కౄరంగా ఉండడం, కఠినత్వం చూపడంలో స్పష్టంగా కనిపిస్తాయి.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "దుష్టత్వం” “దుర్మార్గత" పదాలు "చెడు" లేదా "పాపపూరితమైన” లేదా "అనైతిక" అని అనువదించబడవచ్చు.
  • "మంచిది కానిది" లేదా "నీతి కానిది" అని కూడా ఇతర విధాలుగా అనువదించవచ్చు.
  • ఈ పదాలు, పద బంధాలు లక్ష్య భాషలో సహజమైన, సందర్భ సహితమైన రీతిలో ఉపయోగించబడేలా జాగ్రత్త పడండి.

(చూడండి: అవిధేయత, పాపం, మంచి, నీతిమంతుడు, దయ్యం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 02:04 "మీరు దానిని తినిన వెంటనే మీరు దేవుని వలే అవుతారని దేవునికి తెలుసు మరియు ఆయనకు వలే మంచి, చెడు లను తెలుసుకొంటారు.
  • 03:01 చాలాకాలం తరువాత అనేక మంది ప్రజలు లోకంలో నివసిస్తున్నారు. వారు చాలా దుర్మార్గంగా మరియు హింసాత్మకంగా తయారయ్యారు.
  • 03:02 అయితే నోవహు దేవుని దయను పొందాడు. అతడు దుష్టుల మధ్య నివసిస్తున్న నీతిమంతుడు.
  • 04:02 దేవుడు వారు అందరూ కలిసి దుష్టత్వం చేయడానికి కలిసిపనిచేసినట్లయితే, వారు అనేక పాపపూరితమైన కార్యాలు చేస్తారని దేవుడు చూచాడు.
  • 08:12 "నన్ను ఒక బానిసగా అమ్మివేసినప్పుడు మీరు దుష్టత్వం చేయడానికి ప్రయత్నించారు. అయితే దేవుడు దుష్టత్వాన్ని మేలు కోసం ఉపయోగించాడు!"
  • 14:02 వారు (కనానీయులు) ఆరాధించిన అబద్ధ దేవుళ్ళను పూజించారు, అనేక దుష్ట కార్యాలు చేశారు.
  • 17:01 అయితే అప్పుడు అతడు (సౌలు) ఒక దుర్మార్గుడైన వ్యక్తిగా మారాడు. దేవునికి విధేయత చూపలేదు. కాబట్టి దేవుడు వేరొక మనిషిని అతని స్థానంలో రాజుగా ఎన్నుకున్నాడు.
  • 18:11 నూతన ఇశ్రాయేలు రాజ్యంలో రాజులు అందరూ దుష్టులే .
  • 29:08 రాజు కోపగించుకుని ఆ దుష్ట సేవకుడిని అతడు తన ఋణం అంతా తీర్చే వరకు చెరసాలలో వేయించాడు.
  • 45:02 "అతడు (స్తెఫను) మోషే గురించీ, దేవుని గురించీ చెడు మాటలు పలకడం మేము విన్నాము" అని చెప్పారు."
  • 50:17 అయన (యేసు) ప్రతి కన్నీటి బిందువును తుడిచి వేయును, ఇకమీద హింసలు, విచారం, ఆక్రోశం, దుష్టత్వం, బాధ నొప్పి, లేక మరణం ఉండవు.

పదం సమాచారం:

  • Strong's: H205, H605, H1100, H1681, H1942, H2154, H2162, H2617, H3415, H4209, H4849, H5753, H5766, H5767, H5999, H6001, H6090, H7451, H7455, H7489, H7561, H7562, H7563, H7564, G92, G113, G459, G932, G987, G988, G1426, G2549, G2551, G2554, G2555, G2556, G2557, G2559, G2560, G2635, G2636, G4151, G4189, G4190, G4191, G5337