te_tw/bible/kt/demon.md

5.2 KiB

దయ్యం, దురాత్మ, మలిన ఆత్మ

నిర్వచనం:

ఈ పదాలు అన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న దయ్యాలను సూచించేవి.

  • దేవుడు తనను సేవించడానికి దేవదూతలను చేశాడు. సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు కొందరు దేవదూతలు కూడా తిరుగుబాటులో పాల్గొని పరలోకం నుండి గెంటివేయబడ్డారు. దయ్యాలు, దురాత్మలు ఈ "పతనమైన దేవదూతలు" అంటారు.
  • కొన్ని సార్లు ఈ దయ్యాలను "మలిన ఆత్మలు" అన్నారు. "మలిన" అంటే "అపరిశుద్ధ” లేక “దుష్ట” లేక “అపవిత్ర."
  • ఎందుకంటే దయ్యాలు దుర్మార్గాలు చేస్తూ సాతానును సేవిస్తారు. కొన్ని సార్లు వారు మనుషుల్లో దూరి వారిని అదుపు చేస్తారు.
  • దయ్యాలు మనుషుల కంటే శక్తివంతమైన జీవులు. అయితే దేవుని కంటే శక్తివంతులు కారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "దయ్యం" "దురాత్మ"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
  • ఈ పదం "అపవిత్రాత్మ"ను "అపరిశుద్ధ ఆత్మ” లేక “చెడిన ఆత్మ” లేక “దురాత్మ అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
  • ఈ పదం లేక పదబంధాలను సాతానును సూచించే వివిధ పాదాలను అనువదించడంలో ఉపయోగిస్తారు అనేది గుర్తుంచుకోండి.
  • ఈ పదం "దయ్యం" అనే దాన్ని అనువదించ వచ్చు స్థానిక, జాతీయ భాష పదాలతో తర్జుమా చెయ్యవచ్చు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: దయ్యం పట్టిన, సాతాను, అబద్ధ దేవుడు, అబద్ధ దేవుడు, దేవదూత, దుష్టత్వం, శుద్ధ)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 26:09 అనేక మంది ప్రజలు దయ్యాలు పట్టిన వారిని యేసు దగ్గరకు తెచ్చారు. యేసు వారిని అజ్ఞాపించినప్పుడు దయ్యాలు మనుషుల నుండి బయటకు వచ్చాయి. అవి తరచుగా "నీవు దేవుని కుమారుడవు!" అని అరిచాయి.
  • 32:08 దయ్యాలు ఆ మనిషిలోనుండి బయటికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి.
  • 47:05 చివరకు ఒక రోజు బానిస బాలిక కేకలు వేస్తుంటే, పౌలు ఆమె వైపు తిరిగి ఆమెలోని__దయ్యాన్ని__బయటికి రమ్మని చెప్పాడు." వెంటనే దయ్యం ఆమెను విడిచి పోయింది.
  • 49:02 ఆయన (యేసు) నీటిపై నడిచాడు. తుఫానును శాంతపరిచాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను 5,000 మందిని ఆహారంగా ఇచ్చాడు.

పదం సమాచారం:

  • Strong's: H2932, H7307, H7451, H7700, G169, G1139, G1140, G1141, G1142, G4190, G4151, G4152, G4189