te_tw/bible/kt/angel.md

7.8 KiB

దేవదూత, దేవదూతలు, ప్రధాన దూత

నిర్వచనం:

దేవదూత దేవుడు సృష్టించిన ఒక శక్తివంతమైన ఆత్మ. దేవదూతలు దేవుణ్ణి సేవిస్తూ ఆయన చెప్పినది చేసే వారు. "ప్రధాన దూత" అనే ఈ పదం దేవదూత ఇతర దేవదూతల నాయకునికి వర్తిస్తుంది.

  • ఈ పదానికి అక్షరార్థం "దేవదూత""వార్తాహరుడు."
  • "ప్రధాన దూత" అంటే అక్షరాలా "ప్రధాన వార్తాహరుడు." "ప్రధాన దూత" అని బైబిల్లో చెప్పిన దేవదూత ఒక్క మిఖాయేలు మాత్రమే.
  • బైబిల్లో, దేవదూతలు దేవుని నుండి మనుషులకు సందేశాలు తెచ్చే వారు. ఈ సందేశాలలో దేవుడు తన ప్రజలకు ఇస్తున్న సూచనలు ఉన్నాయి.
  • దేవదూతలు మనుషులకు రాబోయే కాలంలో జరగనున్న సంఘటనలు తెలియ జేస్తారు. లేక ఇప్పటికే జరిగిపోయిన సంఘటనలు చెబుతారు.
  • దేవదూతలకు దేవుని ప్రతినిధులుగా అయన అధికారం ఉంది. కొన్ని సార్లు బైబిల్లో దేవుడే మాట్లాడుతున్నట్టు వీరు మాట్లాడుతారు.
  • దేవదూతలు దేవుణ్ణి సేవించే ఇతర మార్గాలు, మనుషులకు భద్రత, బలం ఇవ్వడం ద్వారా.
  • ఒక ప్రత్యేక పద బంధం, "యెహోవా దూత," అనే దానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నాయి: 1) "యెహోవాకు ప్రతినిధిగా ఉన్న దేవదూత” లేక “యెహోవాను సేవించే వార్తాహరుడు." 2) అది సాక్షాత్తూ యెహోవాకే వర్తిస్తుంది. అయన దేవదూతగా కనిపించి వ్యక్తులతో మాట్లాడాడు. ఈ రెంటిలో ఈ అర్థం దేవదూతలు "నేను"అంటూ తానే యెహోవానన్నట్టు మాట్లాడడం ఎందుకో వివరిస్తుంది.

అనువాదం సలహాలు:

  • "దేవదూత"అనే మాటను అనువదించడంలో "దేవుని నుండి వార్తాహరుడు” లేక “దేవుని పరలోక సేవకుడు” లేక “దేవుని ఆత్మ వార్తాహరుడు"అనే అర్థాలు వస్తాయి.
  • "ప్రధాన దూత" అనే ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రధాన దేవదూత” లేక “దేవదూతలను శాసించే వాడు” లేక “దేవదూతల నాయకుడు."
  • ఈ పదాలను అనువదించడం జాతీయ భాష లో లేక మరొక స్థానిక భాషలో ఎలా అనేది ఆలోచించండి.
  • "యెహోవా దూత" అనే పద బంధాన్ని అనువదించడం "దేవదూత,” “యెహోవా” అనే మాటలను చెప్పడానికి ఉపయోగించే మాటలతో చెయ్యాలి." ఇలా చెయ్యడం ద్వారా ఆ పద బంధం వివిధ వివరణలు సరిపోతాయి. ఇంకా ఇక్కడ వాడదగిన అనువాదాలు, "యెహోవా నుండి వచ్చిన దేవదూత” లేక “యెహోవా పంపిన దేవదూత” లేక “దేవదూతలాగా కనిపించిన యెహోవా."

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: ప్రధాని, శిరస్సు, వార్తాహరుడు, మిఖాయేలు, అధిపతి, సేవకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 02:12 దేవుడు గొప్ప శక్తివంతమైన దేవదూతలను తోట ప్రవేశ ద్వారం వద్ద ఉంచాడు. ఎవరైనా ప్రవేశించి జీవ వృక్షం పండు తినకూడదని ఇలా చేశాడు.
  • 22:03 దేవదూత జెకర్యాకు జవాబిస్తూ, "నన్ను ఈ మంచి వార్త వినిపించడానికి దేవుడు పంపాడు."
  • 23:06 హటాత్తుగా మెరిసిపోతున్న ఒక దేవదూత వారికి (కాపరులకు), ప్రత్యక్షం అయ్యాడు. వారు భయంతో బిగుసుకు పోయారు. దేవదూత వారికి ఇలా చెప్పాడు, "భయపడకండి, ఎందుకంటే మీకోసం మంచి వార్త తెచ్చాను."
  • 23:07 హటాత్తుగా, ఆకాశం దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన పాటలతో నిండిపోయింది.
  • 25:08 అప్పుడు దేవదూతలు వచ్చి యేసుకు సేదదీర్చారు.
  • 38:12 యేసు తన చెమట రక్తబిందువులుగా పడుతుండగా గొప్ప యాతన అనుభవించాడు. దేవుడు ఒక దేవదూతను ఆయన్ను బలపరచడం కోసం పంపించాడు.
  • 38:15 "నన్ను కాపాడడానికి తండ్రిని గొప్ప దేవదూతల సైన్యం కోసం అడగలేనా."

పదం సమాచారం:

  • Strong's: H47, H430, H4397, H4398, H8136, G32, G743, G2465