te_tw/bible/other/head.md

5.1 KiB

శిరస్సు, శిరస్సులు, నుదురు, నుదురులు, బట్టతల, తల కట్టులు, తలపాగాలు, శిరచ్చేదనం

నిర్వచనం:

బైబిల్లో "శిరస్సు" అనే మాటను అనేక అలంకారిక అర్థాలతో ఉపయోగిస్తారు.

  • తరచుగా ఈ పదాన్ని ప్రజలపై అధికారంగల వారికి ఉపయోగిస్తారు. "నీవు నన్ను జతులపై శిరస్సుగా నియమించావు." దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నీవు నన్ను అధిపతిగా నియమించావు…” లేక “నీవు నాకు అధికారం ఇచ్చావు."
  • యేసుకు "సంఘ శిరస్సు" అని పేరు. ఒక వ్యక్తి శిరస్సు శరీరంలోని అవయవాలన్నిటినీ నడిపించినట్టే యేసు కూడా తన "శరీరం," అంటే సంఘం లోని వారిని నడిపిస్తాడు.
  • భర్త తన భార్యకు "శిరస్సు" లేక అధికారం అని కొత్త నిబంధన బోధిస్తున్నది. తన భార్యకు, కుటుంబానికి మార్గదర్శకత్వం చేసే బాధ్యత అతనిది.
  • "తన శిరస్సుమీదికి మంగలి కత్తి రానివ్వకూడదు" అంటే అతడు ఎప్పుడూ తన జుట్టు గొరిగించుకోరాదు.
  • "శిరస్సు" అంటే చెట్టు పైభాగం లేక మూలం అని కూడా అర్థం.
  • " ధాన్యం కంకులు" అంటే గోదుమ లేక బార్లీ మొక్కలో విత్తనాలు ఉండే భాగం.
  • అలంకారికంగా "శిరస్సు" అనేది మరొక రకంగా కూడా ఉపయోగిస్తారు. మొత్తంగా ఒక వ్యక్తిని సూచించడానికి "నెరసిన వెంట్రుకలు గల శిరస్సు." అంటే ముసలి వాడు. "యోసేపుతల," అంటే యోసేపు అని అర్థం. (చూడండి: ఉపలక్ష్య అలంకారం)
  • "వారి రక్తం వారి తలల మీద ఉండుగాక" అంటే ఆ మనిషి వారి మరణాలకు బాధ్యుడు. దానికి శిక్ష అతడు భరిస్తాడు.

అనువాదం సలహాలు

  • సందర్భాన్ని బట్టి, "శిరస్సు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అధికారం” లేక “ నడిపించే వాడు” లేక “బాధ్యుడైన మనిషి."
  • "ఒకని తల” అంటే మొత్తంగా ఒక వ్యక్తిని సూచిస్తూ అనువదించవచ్చు. ఉదాహరణకు, " యోసేపు శిరస్సు" అనే మాటను "యోసేపు" అని అనువదించ వచ్చు.
  • "తన తలపై" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దానికి అతడే బాధ్యుడు” లేక “దానికి శిక్ష అతనికే” లేక “అతడే దానికి బాధ్యుడు” లేక “ఆ దోషాన్ని అతడు భరిస్తాడు."
  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని అనువదించడంలో ఇతర పద్ధతులు "ఆరంభం” లేక “మూలం” లేక “అధిపతి” లేక “నాయకుడు” లేక “పెద్ద."

(చూడండి: ధాన్యం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H441, H1270, H1538, H3852, H4425, H4761, H4763, H5110, H5324, H6285, H6287, H6797, H6915, H6936, H7139, H7144, H7146, H7217, H7226, H7218, H7541, H7636, H7641, H7872, G346, G755, G2775, G2776, G4719