te_tw/bible/kt/satan.md

8.3 KiB

సాతాను, దెయ్యం, దుష్టుడు

వాస్తవాలు:

దెయ్యం దేవుడు సృష్టించిన ఆత్మ అయినప్పటికీ, అది దేవునికి విరుద్ధముగా తిరస్కారము చేశాడు మరియు దేవునికి శత్రువుగా మారాడు. దెయ్యమును “సాతాను” మరియు “దుష్టుడు” అని కూడా పిలుస్తారు.

  • దెయ్యం దేవుణ్ణి మరియు దేవుడు సృష్టించిన ప్రతిదానిని సహ్యించుకుంటుంది ఎందుకంటే వాడు దేవుని స్థానమును పొందుకోవాలని మరియు దేవునిలా ఆరాధించబడాలని కోరుకుంటాడు.
  • దేవునికి విరుద్ధముగా తిరస్కారము చేయునట్లు సాతాను ప్రజలను ప్రేరేపిస్తాడు.
  • దేవుడు ప్రజలను సాతాను నియంత్రణనుండి రక్షించుటకు తన కుమారుడైన యేసును పంపించాడు.
  • “సాతాను” అను పేరుకు “అపవాధి” లేక “శత్రువు” అని అర్థము.
  • “దెయ్యము” అను పదమునకు “ఆరోపి” అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • “దెయ్యం” అనే పదమును “ఆరోపి” లేక “దుష్టుడు” లేక “దుష్టాత్మలకు రాజు” లేక “ప్రధాన దుష్టాత్మ” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “సాతాను” అనే పదమును “విరోధి” లేక “అపవాది” లేక వాడు దెయ్యము అని చూపించే ఇతర పేర్లతో తర్జుమా చేయుదురు.
  • ఈ పదాలన్ని దెయ్యము మరియు దుష్టాత్మ అనే పదాలకు విభిన్నముగా తర్జుమా చేయుదురు.
  • ఈ పదాలన్నిటిని స్థానిక లేక జాతీయ భాషలో ఎలా తర్జుమా చేశారో గమనించండి.

(చూడండి: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: దెయ్యము, దుష్టాత్మ, దేవుని రాజ్యము, శోధించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణములు:

  • 21:01 హవ్వను మోసగించిన పామే సాతాను. మెస్సయ్యా వచ్చి సాతానును సంపూర్ణముగా ఓడించునని వాగ్ధానము చేయబడియుండెను.
  • 25:06 ఆ తరువాత సాతాను యేసుకు ఈ లోక రాజ్యములన్నిటిని మరియు వాటి వైభవమును చూపించెను. అంతేగాకుండా, “నీవు నాకు నమస్కరించి, నన్ను ఆరాధించినయెడల నేను వీటన్నిటిని ఇచ్చెదను” అని చెప్పెను.
  • 25:08 యేసు సాతాను శోధనలకు లోబడలేదు గనుక సాతాను ఆయనను వదిలిపెట్టి వెళ్ళెను.
  • 33:06 అందుచేత యేసు “విత్తనము దేవుని వాక్యము” అని వివరించెను. మార్గము అనేది దేవుని వాక్యము వినే వ్యక్తి అని అర్థము, అయితే ఆ వ్యక్తి దేవుని వాక్యమును అర్థము చేసుకోడు, మరియు దెయ్యము వానినుండి దేవుని వాక్యమును తీసివేయును.
  • 38:07 యూదా రొట్టెను తీసుకొనిన తరువాత, సాతానుడు వానిలోనికి ప్రవేశించెను.
  • 48:04 హవ్వ సంతానములో ఒకరు సాతానుని తలను నలగగొట్టుదురు, మరియు సాతాను తన మడిమకు గాయము చేయును అని దేవుడు వాగ్ధానము చేసియుండెను. సాతాను మెస్సయ్యాను చంపును అని దీని అర్థము, కాని దేవుడు మరల ఆయనను తిరిగి సజీవునిగా చేయును, మరియు మెస్సయ్యా సాతాను శక్తిని నలగగొట్టును.
  • 49:15 దేవుడు నిన్ను సాతాను యొక్క చీకటి రాజ్యములోనుండి బయటికి తీసుకొని వచ్చి, దేవుని వెలుగు రాజ్యములోనికి ప్రవేశపెట్టును.
  • 50:09 “గురుగులు దుష్టునికి సంబంధించిన ప్రజలను సూచిస్తుంది. గురుగులను విత్తిన శత్రువు దెయ్యమును సూచిస్తుంది.”
  • 50:10 “లోకాంతము సంభవించినప్పుడు దూతలన్నియు దుష్టునికి సంబంధించిన ప్రతియోక్కరిని ఒక్క దగ్గరికి పోగు చేస్తారు మరియు వారిని అగ్నిలోనికి పారవేస్తారు, అక్కడ పండ్లు కొరుకుటయు మరియు ఏడ్పును ఉండును.”
  • 50:15 యేసు తిరిగి వచ్చినప్పుడు, ఆయన సాతానును మరియు తన రాజ్యమును సంపూర్ణముగా నాశనము చేయును. ఆయన సాతానును మరియు దేవునికి లోబడక వానిని అనుసరించే ప్రతియొక్కరిని నరకములోనికి పడవేసి, శాశ్వతముగా కాల్చివేయును.

పదం సమాచారం:

  • Strong's: H7700, H7854, H8163, G1139, G1140, G1141, G1142, G1228, G4190, G4566, G4567