te_tw/bible/kt/priest.md

8.7 KiB

యాజకుడు, యాజకులు, యాజకత్వము

నిర్వచనము:

పరిశుద్ధ గ్రంథములో ఒక యాజకుడు దేవుని ప్రజల పక్షముగా దేవుని బలులు అర్పించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తియైయున్నాడు. “యాజకత్వము” అనునది యాజకుని స్థితిని లేక అతని ధర్మమును తెలియజేయు పదమునైయున్నది.

  • పాత నిబందనలో ఇశ్రాయేలు జనము కొరకు దేవుని యాజకులుగా ఉండుటకు ఆయన ఆహరోనును మరియు అహరోను సంతతిని ఎన్నుకొనెను.
  • “యాజకత్వము” అనునది లేవియుల సంతతిలో తండ్రినుండి కుమారునికి అందించే ఒక బాధ్యత మరియు ఒక హక్కుగా పరిగణించబడినది.
  • ఇశ్రాయేలు యాజకులు దేవాలయములో తమ కర్తవ్యములుతోపాటు ప్రజలు దేవునికి అర్పించు బలుల బాధ్యతను కూడా కలిగియుండిరి.
  • యాజకులు కూడా దేవుని ప్రజల పక్షముగా దేవుని దైనందిన ప్రార్థనలు అర్పించెడివారు మరియు ఇతర భక్తి సంబంధమైన ఆచారములను జరిగించెడివారు.
  • యాజకులు సంప్రదాయకమైన ఆశీర్వాదములను జనులపైన పలుకుతారు మరియు వారికి ధర్మశాస్త్రమును తెలియజేస్తారు.
  • యేసు కాలములో రెండు రకాల యాజకులు ఉండేవారు, వారిలో ప్రధాన యాజకులు మరియు మహా యాజకుడు ఉందురు.
  • యేసు దేవుని సన్నిధిలో మనకొరకు విజ్ఞాపనముచేసే “మహా ప్రధాన యాజకుడైయున్నాడు”. ఆయన తనను తాను పాపముకొరకు అంతిమ బలిగా అర్పించుకొనియున్నాడు. మనుష్య యాజకుల ద్వారా చేయబడే బలులు ఎప్పటికి అవసరములేదని ఈ మాటకు అర్థము.
  • క్రొత్త నిబంధనలో యేసునందు విశ్వాసముంచిన ప్రతియొక్కరు “యాజకులుగా” పరిగణించబడియున్నారు. వీరు తమకొరకు మరియు ఇతరులకొరకు విజ్ఞాపన చేయుటకు ప్రార్థనలో దేవునితో నేరుగా మాట్లాడుటకు యోగ్యులైయున్నారు.
  • పురాతన కాలములో బయలు దేవత అనేటువంటి అబద్ధపు దేవుళ్ళకు అర్పించిన ఇతర అన్య యాజకులు కూడా ఉండిరి.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, “యాజకుడు” అనే ఈ పదమును “బలిని ఇచ్చువాడు” లేక “దేవుని మధ్యవర్తి” లేక “బలిని అర్పించు మధ్యవర్తి” లేక “దేవునికి ప్రాతినిధ్యం వహించుటకు ఆయన ఎన్నుకొనిన ఒక వ్యక్తి” అని కూడా తర్జుమా చేయవచ్చు.
  • తర్జుమా చేయబడిన “యాజకుడు” అనే ఈ పదము “మధ్యవర్తి” అనే పదమునకు విభిన్నమైనది మరియు వేరే అర్థమును కలిగియున్నది.
  • “ఇశ్రాయేలు యాజకుడు” లేక “యూదుడైన యాజకుడు” లేక “యెహోవ యాజకుడు” లేక “బయలు యాజకుడు” అని కొంతమంది అనువాదకులు ఎల్లప్పుడు చెప్పడానికి ప్రాధాన్యతనిస్తారు.
  • “యాజకుడు” అని తర్జుమా చేసిన ఈ పదము “ప్రధాన యాజకుడు”, “మహా యాజకుడు”, “లేవియుడు” మరియు “ప్రవక్త” అనే పదములకు విభిన్నముగా ఉండాలి.

(ఈ పదములను కూడా చూడండి: అహరోను, ప్రధాన యాజకులు, మహా యాజకుడు, మధ్యవర్తి, బలియాగము)

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 04:07 “మెల్కీసెదెకు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు.”
  • 13:09 ధర్మశాస్త్రమునకు అవిధేయత చూపించువారు దేవుని బలియర్పణగా గుడారపు ప్రవేశ ద్వారమునకు ముందు స్థలమునకు ఒక ప్రాణిని తీసుకొని రావలెయును. యాజకుడు ఆ ప్రాణిని వధించి, దానిని బలిపీఠము మీద దహించవలెను. ఒక జంతువు రక్తము బలిని అర్పించిన వ్యక్తి పాపమును కప్పుతుంది మరియు ఆ వ్యక్తిని దేవుని దృష్టిలో శుద్దునిగా కనబడునట్లు చేస్తుంది. దేవుడు మోషే అన్నయైన ఆహరోనును ఎన్నుకున్నాడు మరియు అహరోను సంతానము ఆయన యాజకులుగా ఉండిరి.
  • 19:07 అందుచేత, బయలు యాజకులు బలియర్పణను సిద్ధపరిచిరి, కాని అగ్నితో వారు దానిని దహించలేకపోయిరి.
  • 21:07 ఇశ్రాయేలు యాజకుడు ప్రజల పాపములకొరకు నియమించబడిన శిక్షకు బదులుగా ప్రజల పక్షముగా దేవుని బలులను అర్పించు వ్యక్తియైయున్నాడు. యాజకులు కూడ ప్రజల కొరకు దేవునికి ప్రార్థన చేసిరి.

పదం సమాచారం:

  • Strong's: H3547, H3548, H3549, H3550, G748, G749, G2405, G2406, G2407, G2409, G2420