te_tw/bible/names/rome.md

4.2 KiB

రోమా, రోమను

వాస్తవాలు:

క్రొత్త నిబంధన కాలములో రోమా పట్టణము రోమా సామ్రాజ్యమునకు కేంద్రమైయుండెను. ఇదిప్పుడు ఆధునిక దేశమైన ఇటలీకి రాజధానియైయున్నది.

  • రోమా సామ్రాజ్యము ఇశ్రాయేలుతో చేర్చి మధ్యధరా సముద్రము చుట్టూ ఉన్నటువంటి ప్రాంతములన్నిటిని పరిపాలించింది.
  • “రోమా” అనే ఈ పదము రోమా నియంత్రణలోనున్న ప్రభుత్వపు ప్రాంతములకు సంబంధించినది దేనినైనా, అందులో రోమా పౌరులను మరియు రోమా అధికారులను కూడా సూచిస్తుంది.
  • అపొస్తలుడైన పౌలును ఒక ఖైదీగా రోమా నగరమునకు తీసుకొని వెళ్ళిరి, ఎందుకంటే ఆయన యేసును గూర్చిన శుభవార్తను ప్రకటించియుండెను.
  • క్రొత్త నిబంధన గ్రంథములోని “రోమా” పుస్తకమును రోమాలోని క్రైస్తవులకు పౌలు వ్రాసిన పత్రికయైయున్నది.

(ఈ పదములను కూడా చూడండి: శుభవార్త, సముద్రము, పిలాతు, పౌలు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 23:04 మరియ ప్రసవించే సమయము దగ్గరికి వచ్చినప్పుడు, రోమా ప్రభుత్వము ప్రతియొక్కరికి తమ పితరులు నివసించిన స్థలములకు వెళ్లి జనాభా లెక్కల్లో చేరమని సెలవిచ్చియుండెను.
  • 32:06 ఆ తరువాత యేసు ఆ దయ్యమును “నీ పేరు ఏమిటి?” అని అడిగెను, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేక గుంపులు ఉన్నాము” అని తిరిగి జవాబిచ్చెను. (రోమా సైన్యములో అనేక వేలాది సైనికుల గుంపును “సేన” అని పిలిచెదరు.)
  • 39:09 ఆ మరుసటి రోజు ఉదయమున, యూదుల నాయకులు యేసును చంపాలనే ఉద్దేశముతో రోమా పాలకుడైన పిలాతు దగ్గరకు తీసుకొనివచ్చిరి.
  • 39:12 రోమా సైనికులు యేసును కొరడాలతో కొట్టిరి, రాజరికపు నిలువంగిని తొడగించిరి మరియు ఆయన తలపైన ముళ్ళ కిరీటమును ధరియింపజేసిరి. “యూదుల రాజా, ఇటు చూడు” అని చెబుతూ ఆయన హేళన చేసిరి.

పదం సమాచారం:

  • Strong's: G4514, G4516