te_tw/bible/names/pilate.md

5.1 KiB

పిలాతు

వాస్తవాలు:

పిలాతు యూదా యొక్క రోమా ప్రాంతానికి పాలకుడైయుండెను, ఇతనే యేసుకు మరణ దండనను విధించాడు.

  • పిలాతు పాలకుడైనందున నేరస్తులకు మరణ దండనను విధించే అధికారము ఇతనికి ఇవ్వబడియుండెను.
  • పిలాతు యేసును సిలువకు వేయించాలని యూదా మత నాయకులందరు కోరిరి, ఇందువలన వారు అబద్దమాడిరి మరియు యేసు ఒక నేరస్తుడని చెప్పిరి.
  • యేసు అపరాధి కాదని పిలాతు గ్రహించాడు, కాని అతను జనులకు భయపడ్డాడు మరియు వారి మెప్పును పొందాలనుకున్నాడు, అందుచేత అతను యేసును సిలువకు వేయమని తన సైనికులకు ఆదేశించాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: సిలువకు వేయు, పాలకుడు, అపరాధం, యూదా, రోమా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 39:09 మరుసటి రోజు ఉదయమున యూదా నాయకులందరు యేసును రోమా పాలకుడైన పిలాతు వద్దకు తీసుకొనివచ్చిరి. పిలాతు యేసును అపరాధిగా ఎంచి శిక్షిస్తాడని మరియు ఆయనను చంపుటకు మరణ దండన విధిస్తాడని వారు నిరీక్షించిరి. అప్పుడు, “నీవు యూదుల రాజువా?” అని పిలాతు యేసును అడిగెను.
  • 39:10 “సత్యమనగా ఏమిటి?” అని పిలాతు అడిగెను.
  • 39:11 యేసుతో మాట్లాడిన తరువాత, పిలాతు జనసమూహములవద్దకు వెళ్లి, “నేను ఈ మనుష్యునియందు ఎటువంటి అపరాధమును కనుగొనలేదు” అని చెప్పెను. అయితే యూదుల నాయకులు మరియు జనసమూహమంతయు, “అతణ్ణి సిలువవేయండి” అని గట్టిగా కేకలు వేసిరి! అప్పుడు “ఇతను అపరాధి కాడు” అని పిలాతు చెప్పెను. అయితే వారు మరి ఎక్కువగా గట్టిగా కేకలు వేసిరి. ఆ తరువాత, “ఇతను అపరాధి కాదు” అని పిలాతు మూడవ మారు చెప్పెను!
  • 39:12 జనసమూహమంతయు హింసాత్మకముగా మారుతుందేమోనని పిలాతు భయపడి, యేసును సిలువకు వేయమని తన సైనికులకు ఆజ్ఞాపించెను.
  • 40:02 అందరు చదువునట్లుగా “యూదులకు రాజు” అని యేసును సిలువ వేసిన తరువాత అతని తలమీద ఒక గురుతుగా పెట్టమని పిలాతు ఆదేశించెను.
  • 41:02 “మరికొంతమంది సైనికులను తీసుకు వెళ్లి, సాధ్యమైనంతవరకు సమాధిని భద్రపరచండి” అని పిలాతు చెప్పెను.

పదం సమాచారం:

  • Strong's: G4091, G4194