te_tw/bible/kt/crucify.md

4.6 KiB

సిలువ వేయు, సిలువ వేయబడిన

నిర్వచనం:

ఈ పదం "సిలువ వేయు" అంటే ఎవరినైనా సిలువకు కొట్టి అతడు అక్కడ బాధలు పడి గొప్ప హింసాత్మక మరణం పొందేలా చేయడం.

  • మరణ శిక్ష పొందుతున్న వాణ్ణి సిలువ కు మేకులతో కొడతారు. సిలువ వేయబడిన మనిషి రక్తం పోవడం, లేక ఊపిరి అందక చనిపోతాడు.
  • ప్రాచీన రోమా సామ్రాజ్యం భయంకర నేరస్థులకోసం, లేక వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిని శిక్షించడానికి ఈ మరణ శిక్ష అమలు పధ్ధతి తరచుగా ఉపయోగిస్తారు.
  • యూదు మత నాయకులు రోమా గవర్నర్ ను యేసును సిలువ వేసేలా తన సైనికులకు అజ్ఞాపించమని అడిగారు. సైనికులు యేసును సిలువకు మేకులతో కొట్టారు. అయన ఆరు గంటలు బాధ అనుభవించి ఆపైన చనిపోయాడు.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "సిలువ వేయు" ఇలా అనువదించ వచ్చు, "సిలువపై వధించడం” లేక “సిలువకు మేకులతో కొట్టడం ద్వారా చంపడం."

(చూడండి: సిలువ, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 39:11 అయితే యూదు నాయకులు, జన సమూహం "అతన్ని (యేసు) సిలువ వేయండి! అని అరిచారు"
  • 39:12 తిరుగుబాటు చేస్తారేమో నని గుంపుకు భయపడి పిలాతు యేసును సిలువ వేయమని తన సైనికులను ఆదేశించాడు. అతడు యేసు క్రీస్తు సిలువ శిక్షలో ముఖ్య పాత్రధారి.
  • 40:01 తరువాత సైనికులు యేసును హేళన చేసి ఆయన్ను సిలువ వేయదానికి తీసుకుపోయారు. వారు అయన చనిపోనున్న మోయు సిలువ ను ఆయనచే మోయించారు.
  • 40:04 యేసును ఇద్దరు దోపిడీ దొంగల మధ్య సిలువ వేశారు.
  • 43:06 "ఇశ్రాయేలు మనుషులారా, యేసు దేవుని శక్తి మూలంగా అనేక మహా సూచనలు, అద్భుతాలు చేసిన వాడుగా మీరు చూశారు, గ్రహించారు. అయితే మీరు ఆయనను సిలువ వేసి చంపారు.!"
  • 43:09 "మీరు సిలువ వేసిన మనిషి యేసు."
  • 44:08 పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు. "మీ ఎదుట నిలుచున్న ఈ మనిషి యేసు మెస్సియా శక్తి చేత స్వస్థత పొందాడు. మీరు సిలువ వేసిన యేసును దేవుడు మరలా లేపాడు!"

పదం సమాచారం:

  • Strong's: G388, G4362, G4717, G4957