6.3 KiB
6.3 KiB
సంఘం, సంఘం
నిర్వచనం:
కొత్త నిబంధనలో, "సంఘం" పదం స్థానికంగా యేసునందు విశ్వాసుల గుంపును సూచిస్తుంది. వీరు ప్రార్థన చెయ్యడానికీ, ప్రకటించబడిన దేవుని వాక్యాన్ని వినడానికీ క్రమంగా కలుసుకొంటారు. పెద్ద అక్షరంతో ఆరంభం అయ్యే "సంఘం" పదం తరచుగా క్రైస్తవులందరినీ సూచిస్తుంది.
- ఇది అక్షరాలా ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం కలుసుకోడానికి "వెలుపలికి పిలువబడిన" ప్రజల సంఘం లేదా సమాజాన్ని అక్షరాలా సూచిస్తుంది. * ఈ పదం అన్ని ప్రదేశాలలో క్రీస్తు శరీరంలోని విశ్వాసులందరినీ సూచించడానికి ఉపయోగించబడింది. స్థానిక సంఘంనుండి భిన్నంగా ఉండడానికి కొందరు బైబిలు అనువాదకులు "సంఘం" పదంలోని మొదటి అక్షరాన్ని పెద్ద అక్షరంగా ఉంచారు.
- తరచుగా ఒక పట్టణంలోని విశ్వాసులు ఒకరి గృహంలో కలుసుకొంటారు. ఈ స్థానిక సంఘాలకు "ఎఫెసులోని సంఘం" అన్నట్లుగా ఆ పట్టణం పేరు ఇవ్వబడుతుంది.
- బైబిలులో "సంఘం" అంటే ఒక కట్టడాన్ని సూచించడం లేదు.
అనువాదం సూచనలు:
- "సంఘం" అనే పదం "గుంపుగా కలవడం" లేదా “సంఘం" లేదా "సమాజం" లేదా గుంపుగా కలిసే వారు" అని అనువదించబడవచ్చు.
- ఈ పదాన్ని అనువదించడానికి ఉపయోగించే పదం లేదా పదబంధం కేవల ఒక చిన్న గుంపును మాత్రమే కాక విశ్వాసులందరినీ సూచించేదిగా కూడా ఉండాలి.
- "సంఘం" పదం అనువాదం ఒక కట్టడాన్ని సూచించేలా ఉండకుండా జాగ్రత్త పడాలి.
- పాత నిబంధనలో "సంఘం" పదాన్ని అనువదించడానికి ఉపయోగించిన పదం కూడా దీనిని అనువదించడానికి ఉపయోగించబడవచ్చు.
- దీన్ని స్థానిక, జాతీయ బైబిలు అనువాదంలో ఇది ఏవిధంగా అనువదించబడిందో కూడా పరిశీలించండి.
(చూడండి: తెలియని వాటిని అనువదించడం ఎలా)
(చూడండి: సంఘం, విశ్వసించు, క్రైస్తవుడు)
బైబిలు రిఫరెన్సులు:
- 1 కొరింథీ 05:12
- 1 థెస్స 02:14
- 1 తిమోతి 03:05
- అపొ.కా. 09:31
- అపొ.కా. 14:23
- అపొ.కా. 15:41
- కొలస్సీ 04:15
- ఎఫెసీ 05:23
- మత్తయి 16:18
- ఫిలిప్పీ 04:15
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 43:12 పేతురు వాక్యాన్ని బోధించినప్పుడు సుమారు 3,000 మంది ప్రజలు విశ్వసించారు, యేసు శిష్యులు అయ్యారు. వారు బాప్తిసం పొందారు, యెరూషలేము సంఘంలో భాగం అయ్యారు.
- 46:09 అంతియొకయలో ఎక్కువమంది యూదులు కాదు. అయితే మొదటి సరిగా వారిలో అనేక మంది విశ్వాసులు అయ్యారు. బర్నబా, సౌలు ఈ కొత్త విశ్వాసులకు యేసును గురించి మరింత బోధించడానికీ సంఘాన్ని బలపరచడానికి అక్కడికి వెళ్లారు.
- 46:10 కాబట్టి అంతియొకయలో సంఘం బర్నబా, సౌలు కోసం ప్రార్థించి వారిపై చేతులు ఉంచారు. తరువాత వారిని సువార్త ప్రకటించడానికి అనేక ఇతర స్థలాలకు పంపారు.
- 47:13 యేసు సువార్త వ్యాపిస్తూ సంఘం పెరుగుతూ వచ్చింది.
- 50:01 దాదాపు 2,000 సంవత్సరాలు, లోకమంతటా మరింత మంది ప్రజలు యేసును గురించిన సువార్త విన్నారు. సంఘం ఎదుగుతూ ఉంది.
పదం సమాచారం:
- Strong's: G1577