te_tw/bible/kt/sonofgod.md

8.0 KiB

దేవుని కుమారుడు, కుమారుడు

వాస్తవాలు:

“దేవుని కుమారుడు” అనే ఈ మాట మనుజావతారుడై ఈ లోకములోనికి వచ్చిన వాక్యమైన యేసును సూచిస్తుంది, ఈయనను అనేకమార్లు “కుమారుడు” అని చెప్పబడినది.

  • దేవుని కుమారుడు తండ్రియైన దేవునివలెనే ఒకటే స్వభావమును కలిగియున్నాడు మరియు సంపూర్ణ దేవుడైయున్నాడు.
  • తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరైయున్నారు.
  • మనుష్య కుమారులవలె దేవుని కుమారుడు ఎల్లప్పుడూ అస్తిత్వములో ఉన్నాడు.
  • ప్రారంభములో సర్వలోకమును సృష్టించునప్పుడు తండ్రియైన దేవుడు మరియు పరిశుద్ధాత్మలతోపాటు దేవుని కుమారుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే యేసు దేవుని కుమారుడైయున్నాడు, ఆయన తన తండ్రి ప్రేమించి విధేయత చూపును, మరియు తండ్రి తనను ప్రేమించును.

తర్జుమా సలహాలు:

  • “దేవుని కుమారుడు” అనే మాట కొరకు, మనుష్య కుమారుని సూచించుటకు సాధారణముగా తర్జుమా చేయు భాషలో ఉపయోగించే పదముతో “కుమారుడు” అనే పదమును తర్జుమా చేయడం ఉత్తమము.
  • “తండ్రి” అని తర్జుమా చేయుటకు ఉపయోగించిన పదముతో “కుమారుడు” అని తర్జుమా చేయుటకు ఉపయోగించిన పదము సరిపోతుందో లేదోనని చూసుకొనుడి. ఈ పదములు అనువాద భాషలో తండ్రి కుమారుల నిజమైన సంబంధమును వ్యక్తపరచుటకు ఉపయోగించే సర్వసాధారణమైన పదాలైయుండవలెను.
  • ఆంగ్ల భాషలో "Son" (సన్) అనే పదమునకు కుమారుడు అని అర్థము, అయితే ఆ పదమునకు మొదటి అక్షరము పెద్దదిగా చేసి ఉపయోగించినప్పుడు ఆ పదము దేవునిని గూర్చి సంబోదిస్తుందని దాని అర్థము.
  • “దేవుని కుమారుడు” అనే మాటకు “కుమారుడు” అనే మాట ఉపయోగిస్తారు, విశేషముగా “తండ్రి” అని ఉపయోగించిన సందర్భములో దీనిని ఉపయోగిస్తారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: క్రీస్తు, పితరుడు, దేవుడు, తండ్రియైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసు, కుమారుడు, దేవుని కుమారులు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథములోనుండి ఉదాహరణలు:

  • 22:05 “పరిశుద్ధాత్ముడు నీయొద్దకు వచ్చును, మరియు దేవుని శక్తి నిన్ను ఆవరించును. తద్వారా పుట్టబోయే శిశువు పరిశుద్దుడు, “దేవుని కుమారుడైయుండును” అని అని దూత వివరించి చెప్పెను.
  • 24:09 “నీవు బాప్తిస్త్మము ఇచ్చు మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చును. ఆ వ్యక్తే దేవుని కుమారుడైయుండును “ అని దేవుడు యోహానుతో చెప్పియున్నాడు.
  • 31:08 శిష్యులు ఆశ్చర్యచకితులైరి. వారు యేసును ఆరాధించిరి, “నిజముగా, నీవు దేవుని కుమారుడవే “ అని ఆయనతో చెప్పిరి.
  • 37:05 “అవును, బోధకుడా! నీవు మెస్సయ్యావని, దేవుని కుమారుడవని నేను నమ్ముచున్నాను” అని మార్తా జవాబునిచ్చెను.
  • 42:10 అందుచేత మీరు సమస్త ప్రజల దగ్గరికి వెళ్లి వారిని శిష్యులనుగా చేయుడి, వారికి తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మమిచ్చుచు, నేను ఆజ్ఞాపించినవాటినన్నిటికి విధేయత చూపవలెనని వారికి బోధించుడి.
  • 46:06 అప్పటికప్పుడే, సౌలు దమస్కులోని యూదులకు “యేసే దేవుని కుమారుడు “ అని సువార్తను ప్రకటించుటకు ప్రారంభించెను!
  • 49:09 అయితే దేవుడు లోకములోని ప్రతియొక్కరిని ఎంతో ప్రేమించెను, ఆయన తన ఒక్కగానొక్క కుమారున్ని ఇచ్చెను, తద్వారా యేసునందు విశ్వసించువారు తమ పాపముల కొరకు శిక్షించబడకుండా, దేవునితో శాశ్వతకాలము జీవించెదరు.

పదం సమాచారం:

  • Strong's: H426, H430, H1121, H1247, G2316, G5207