te_tw/bible/other/father.md

4.6 KiB

పూర్వీకుడు, పూర్వీకులు, తండ్రి, తండ్రులు, తాత

నిర్వచనం:

అక్షరాలా, "తండ్రి" కన్న తండ్రి. అనేక విధాల అలంకారికంగా కూడా ఈ పదం వాడతారు.

  • "తండ్రి” “పితరుడు" అనే పదాలను తరచుగా కొన్ని వ్యక్తి, లేక ప్రజలు సమూహాల మగ పూర్వీకులకు ఉపయోగిస్తారు. ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు"పూర్వీకుడు” లేక “పితరుడు."
  • "తండ్రి" అనే పదాన్ని అలంకారికంగా ఒక బృందానికి నాయకుడు లేక దేనికైనా మూలం అయిన వారికి వాడతారు. ఉదాహరణకు, ఆది 4లో "గుడారాల్లో నివసించే వారందరికీ తండ్రి" అంటే, "గుడారాల్లో నివసించిన మొదటి తెగ నాయకుడు" అని అర్థం.
  • అతడు సువార్త చెప్పి క్రైస్తవులుగా మారడానికి సహాయం చేసిన వారిని అపోస్తలుడు పౌలు అలంకారికంగా తనను "తండ్రి" అని పిలుచుకున్నాడు.

అనువాదం సలహాలు

  • తండ్రి గురించి చెప్పేటప్పుడు మీ భాషలో అక్షరార్థంగా కుమారుడు, అనే దాన్ని సాధారణ పదం ఉపయోగించి తర్జుమా చెయ్య వచ్చు.
  • "దేవుడు తండ్రి" అనే దాన్ని మీ భాషలో ఎక్కువగా వాడే పదాన్ని ఉపయోగించి అనువదించ వచ్చు.
  • పితరులను ఉద్దేశించి వాడేట ప్పుడు ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పూర్వీకులు” లేక “పితరులు."
  • పౌలు అలంకారికంగా తనను క్రీస్తు విశ్వాసులకు తండ్రిగా చెప్పుకున్నప్పుడు ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ఆత్మ సంబంధమైన తండ్రి” లేక “క్రీస్తులో తండ్రి."
  • కొన్ని సార్లు "తండ్రి" ని ఇలా అనువదించ వచ్చు. "తెగ నాయకుడు."
  • "అబద్ధాలకు తండ్రి" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అన్ని అబద్ధాలకు మూలం” లేక “ ఎవరి నుంచి అన్ని అబద్ధాలు వస్తాయో."

(చూడండి: దేవుడు తండ్రి, కుమారుడు, దేవుని కుమారుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1, H2, H25, H369, H539, H1121, H1730, H1733, H2524, H3205, H3490, H4940, H5971, H7223, G256, G540, G1080, G2495, G3737, G3962, G3964, G3966, G3967, G3970, G3971, G3995, G4245, G4269, G4613