te_tw/bible/kt/son.md

6.9 KiB

కుమారుడు

నిర్వచనం:

స్త్రీ పురుషులకు పుట్టిన మగ సంతానమును అతని జీవితకాలమంతా వారి “కుమారుడు” అని పిలువబడతాడు. ఇతడు ఆ పురుషుని కుమారుడనీ, ఆ స్త్రీ కుమారుడని కూడా పిలువబడతాడు. “దత్తపుత్రుడు” అనగా కుమారుని స్థానములో ఉండుటకు చట్టబద్ధంగా ఉంచబడిన మగబిడ్డ.

  • బైబిలులో "యొక్క కుమారుడు" పదం ఒకని ముందు తరం నుండి ఆ వ్యక్తి తండ్రి, తల్లి లేదా పితరులను గురించించడానికి ఉపయోగిస్తారు. ఈ పదం వంశావళులలోనూ, ఇతర చోట్లా ఉపయోగించబడుతుంది.
  • తండ్రి పేరును ఇవ్వడానికి "యొక్క కుమారుడు" పదం ఉపయోగించడం ఒకే పేరు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, 1 రాజులు గ్రంథం 4 అధ్యాయంలో "సాదోకు కుమారుడైన అజర్యా," నాతాను కుమారుడైన అజర్యా," 2 రాజులు గ్రంథం 15 అధ్యాయంలో అమజ్యా కుమారుడైన అజర్యా" లలో ముగ్గురు భిన్నమైన వ్యక్తులు ఉన్నారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదం ఉపయోగించబడిన అనేక సంభవాలలో భాషలో కుమారుడిని సూచించడం కోసం ఉపయోగించబడిన అక్షరార్థమైన పదం చేత అనువదించడం ఉత్తమం.
  • "దేవుని కుమారుడు" పదం అనువదించేటప్పుడు, "కుమారుడు" కోసం లక్ష్యభాషలోని సాధారణ పదం ఉపయోగించబడింది.
  • కొన్నిసార్లు "కుమారులు" పదం మగపిల్లలూ, ఆడపిల్లలూ సూచించబడేలా "పిల్లలు" పదం చేత అనువదించబడవచ్చు. ఉదాహరణకు, "దేవుని కుమారులు" పదం "దేవుని పిల్లలు" అని అనువదించబడవచ్చు, దీనిలో ఆడపిల్లలూ, స్త్రీలూ కలిసి ఉన్నారు.

(చూడండి: అజర్యా, సంతానము, పితరుడు, ప్రథమ సంతానము, దేవుని కుమారుడు, దేవుని కుమారులు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 04:08 దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, అతనికి ఒక కుమారుని మరల వాగ్దానం చేశాడు, ఆకాశాములో నక్షత్రములవలె లెక్కలేనంతమంది సంతానమును అనుగ్రహిస్తానని వాగ్ధానము చేశాడు.
  • 04:09 “నీ స్వంత శరీరమునుండి కుమారుని నీకు ఇచ్చెదనని” దేవుడు చెప్పాడు.
  • 05:05 ఒక సంవత్సరమైన తరువాత, అబ్రాహాముకు 100 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, శారాకు 90 సంవత్సరములు ఉన్నప్పుడు, శారా అబ్రాహాముకు కుమారుని కన్నది.
  • 05:08 వారు బలి అర్పించు స్థలముకు వచ్చినప్పుడు, అబ్రాహాముకు తన కుమారుడైన ఇస్సాకును కట్టి, బలిపీఠము మీద ఉంచాడు. అతడు తన కుమారుని బలి ఇవ్వబోయే సమయములో, “ఆగుము! బాలుని ఏమి చేయవద్దు! నువ్వు నాకు భయపడుదువని, నీ ఒక్కగానొక్క కుమారుని నాకిచ్చుటకు వెనుక తీయవని నేనిప్పుడు తెలుసుకొనియున్నాను” అని దేవుడు చెప్పాడు.
  • 09:07 ఆమె బిడ్డను చూసినప్పుడు, ఆమె తన స్వంత కుమారునిగా స్వీకరించెను.
  • 11:06 దేవుడు ఐగుప్తుల ప్రథమ సంతానమైన కుమారులు అందరినీ చంపాడు.
  • 18:01 అనేక సంవత్సరములైన తరువాత, దావీదు మరణించాడు, తన కుమారుడు సొలొమోను పరిపాలించుటకు ఆరంభించాడు.
  • 26:04 “ఇతను యోసేపు కుమారుడు కాడా?” అని వారు చెప్పుకొనిరి.

పదం సమాచారం:

  • Strong's: H1060, H1121, H1123, H1248, H3173, H3206, H3211, H4497, H5209, H5220, G3816, G5043, G5207