te_tw/bible/other/firstborn.md

3.7 KiB

మొదట పుట్టిన

నిర్వచనం:

"మొదట పుట్టిన" అనేది మనుషులకు, జంతువులకు పుట్టిన ప్రథమ సంతానాన్ని సూచిస్తున్నది.

  • బైబిల్లో, "మొదట పుట్టిన" అనే మాట మొదటి మగ సంతానాన్ని సాధారణంగా సూచిస్తున్నది.
  • బైబిల్ కాలాల్లో, మొదట పుట్టిన కుమారుడికి ప్రాధాన్యత, తన కుటుంబం వారసత్వముగా పొందే దానిలో ఇతర కుమారుల కంటే రెట్టింపు భాగం వస్తుంది.
  • తరచుగా మొదట పుట్టిన మగ జంతువును బలి అర్పణగా దేవునికి ఇవ్వాలి.
  • ఈ విషయాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఇశ్రాయేల్ జాతిని దేవుని మొదట పుట్టిన కుమారుడు అన్నారు. ఎందుకంటే దేవుడు ఇతర జాతులు కంటే వారికి ప్రత్యేక సదుపాయాలు ఇచ్చాడు.
  • యేసు, దేవుని మొదటి కుమారుడు. ఎందుకంటే తన ప్రాధాన్యత, అధికారంలో అయన అందరికంటే ఎక్కువ.

అనువాదం సలహాలు:

  • "జ్యేష్ఠ పుత్రుడు" అనే మాట వచ్చినప్పుడు ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "మొదట పుట్టిన మగ” లేక “మొదట పుట్టిన కుమారుడు," ఎందుకంటే దీని అర్థం ఇదే. (చూడండి: ఊహాత్మక పరిజ్ఞానం, అంతర్గత సమాచారం)
  • ఈ పదాన్నిఅనువదించడంలో ఇతర పద్ధతులు. "మొదటి కుమారుడు” లేక “పెద్ద కుమారుడు.”
  • దీన్ని అలంకారికంగా యేసుకు ఉపయోగిస్తారు. దీన్ని ఇలా అనువదించ వచ్చు. "ప్రతి దాని పైనా అధికారం ఉన్న కుమారుడు” లేక “ప్రతిష్టలో ప్రథమ కుమారుడు."
  • జాగ్రత్త: ఈ పదాన్ని అనువాదం చెయ్యడంలో యేసును గురించి చెబితే అయన సృష్టించబడిన వాడు అనే అర్థం రాకుండా చూసుకోవాలి.

(చూడండి: వారసత్వముగా పొందు, బలి అర్పణ, కుమారుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1060, H1062, H1067, H1069, G4416, G5207