te_tw/bible/kt/inherit.md

8.1 KiB

వారసత్వముగా పొందు, వారసత్వము, పిత్రార్జితం, వారసుడు

నిర్వచనం:

"వారసత్వముగా పొందు" అంటే దేన్నైనా విలువైనదాన్ని తల్లిదండ్రులనుండి లేక ఇతరుల నుండి వారితో ప్రత్యేక సంబంధం మూలంగా పొందు. "వారసత్వము" అంటే సంక్రమించినది.

  • వారసత్వము అంటే డబ్బు, భూమి లేక ఇతర రకాల ఆస్తులు.
  • ఆత్మ సంబంధమైన వారసత్వము అంటే దేవుడు యేసుపై నమ్మకముంచిన వారికి ఆశీర్వాదాలతో సహా ప్రస్తుత జీవం తనలో వారికి నిత్య జీవం.
  • బైబిల్ దేవుని ప్రజలను అయన వారసత్వముగా పిలుస్తున్నది. అంటే వారు ఆయనకు చెందిన వారు. వారు అయన విలువైన ఆస్తి.
  • అబ్రాహాము సంతానం కనాను ప్రదేశం వారసత్వముగా పొందుతారని అది వారికి శాశ్వతకాలం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు.
  • అలంకారికంగా లేక ఆత్మ సంబంధమైన రీతిలో దేవునికి చెందిన వారితో అయన "వారసత్వముగా పొందు దేశం" గురించి చెప్పాడు. అంటే వారు వర్థిల్లి శారీరిక, ఆత్మ సంబంధమైన రెండు విధాలుగా దేవుని దీవెనలు పొందుతారు.
  • కొత్త నిబంధనలో, యేసులో నమ్మకముంచిన వారితో "వారసత్వముగా పొందు రక్షణ” “వారసత్వముగా పొందు నిత్య జీవం" గురించి దేవుడు వాగ్దానం చేశాడు. "వారసత్వముగా పొందు దేవుని రాజ్యం" అని వ్యక్త పరిచారు. ఆత్మ సంబంధమైన వారసత్వము శాశ్వతకాలం ఉంటుంది.
  • ఈ పదాలకు ఇతర అలంకారిక అర్థాలు ఉన్నాయి.
  • జ్ఞానం గల ప్రజలు "మహిమను వారసత్వముగా పొందుతారు" న్యాయవంతులైనవారు "మంచివాటిని వారసత్వముగా పొందుతారు."
  • "వారసత్వముగా పొందు వాగ్దానం" అంటే దేవుడు తనవారికి ఇస్తానని వాగ్దానం చేసినవి.
  • ఈ పదాన్ని నెగెటివ్ గా కూడా ఉపయోగిస్తారు. మూర్ఖత్వం అవిధేయత గల మనుషులు "గాలిని వారసత్వముగా పొందుతారు” లేక “మంద బుద్ధి వారసత్వముగా పొందుతారు." అంటే వారు వారి పాపపూరితమైన క్రియల పర్యవసానంగా శిక్ష, వ్యర్థమైన జీవితం పొందుతారు.

అనువాదం సలహాలు:

  • ఎప్పటిలాగానే లక్ష్య భాషలో వారసుడు, లేక వారసత్వము సూచించే పదాలు ఉంటే వాటిని వాడాలి.
  • సందర్భాన్ని బట్టి, ఇతర పద్ధతులుకూడా వాడాలి. "వారసత్వముగా పొందు" అనే మాటని ఇలా అనువదించ వచ్చు "పుచ్చుకొను” లేక “కలిగియుండు” లేక “ఆస్తి సంక్రమించు."
  • "వారసత్వము" అనువదించడం పద్ధతులు. "వాగ్దానం చేసిన” లేక “ఆస్తి స్వాధీనం."
  • ఇది దేవుని ప్రజలను సూచిస్తుంటే వారసత్వము అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆయనకు చెందిన విలువైన దాన్ని."
  • "వారసుడు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. ఒక పదంతో, లేక పదబంధంతో. "తండ్రి ఆస్తిపాస్తులు పొందే హక్కు ఉన్న కొడుకు” లేక “ (దేవుని) ఆత్మ సంబంధమైన ఆస్తిపాస్తులు, ఆశీర్వాదాలు వ్యపొందడానికి ఎన్నుకొనబడిన వ్యక్తి."
  • "స్వాస్థ్యం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుని నుండి ఆశీర్వాదాలు” లేక “వారసత్వముగా పొందే ఆశీర్వాదాలు."

(చూడండి: వారసుడు, కనాను, వాగ్దాన దేశం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 04:06 అబ్రాము కనాను చేరుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, "నీ చుట్టూ చూడు. నీకు నీ సంతానానికి నీవు చూస్తున్న దేశం అంతా వారసత్వముగా ఇస్తాను."
  • 27:01 ఒక రోజు యూదు చట్టప్రవీణుడు యేసును పరీక్షిస్తూ అడిగాడు "బోధకా, నిత్య జీవం వారసత్వముగా పొందాలంటే నేను ఏమి చెయ్యాలి ?"
  • 35:03 "ఒక మనిషికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తన తండ్రితో చెప్పాడు. 'నా వారసత్వము ఇప్పుడు నాకు కావాలి!' కాబట్టి తండ్రి తన ఆస్తులు ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు."

పదం సమాచారం:

  • Strong's: H2490, H2506, H3423, H3425, H4181, H5157, H5159, G2816, G2817, G2819, G2820