te_tw/bible/kt/promisedland.md

6.0 KiB

వాగ్ధాన భూమి

వాస్తవాలు:

“వాగ్ధాన భూమి” అనే ఈ మాట కేవలము బైబిలు కథలలో మాత్రమె కనిపించును గాని, పరిశుద్ధ గ్రంథ వాక్య భాగములలో కనిపించదు. దేవుడు అబ్రాహాముకు మరియు తన సంతానమునకు ఇచ్చుటకు వాగ్ధానము చేసిన కానాను దేశమును సూచించుటకు ఉపయోగించబడిన పర్యాయ పదమునైయున్నది.

  • అబ్రాహాము ఊరు అనే పట్టణములో జీవించుచున్నప్పుడు, కానాను దేశములో నివసించమని దేవుడు తనకు ఆజ్ఞాపించెను. తను మరియు తన సంతానమైన ఇశ్రాయేలీయులందరు అనేక సంవత్సరములు అక్కడ నివసించిరి.
  • కానానులో భయంకరమైన కరువు కాలము వచ్చినప్పుడు ఆహారము లేనందున, ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు బయలుదేరి వెళ్ళిరి.
  • నాలుగు వందల సంవత్సరాల తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని తమ బానిసత్వములోనుండి విడిపించెను మరియు వారిని తిరిగి దేవుడు వారికి వాగ్ధానము చేసిన స్థలమైన కానానుకు తీసుకొని వచ్చెను.

తర్జుమా సలహాలు:

  • “వాగ్ధాన దేశము’ అనే ఈ మాటను “దేవుడు అబ్రాహాముకు ఇస్తానని చెప్పిన దేశము” లేక “దేవుడు అబ్రాహాముకు వాగ్ధానము చేసిన భూమి” లేక “దేవుడు తన ప్రజలకు వాగ్ధానము చేసిన భూమి” లేక “కానాను దేశము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • పరిశుద్ధ గ్రంథములో ఈ మాట లేక పదములు “దేవుడు వాగ్ధానము చేసిన భూమి లేక దేశము” అనే మాటలలో కనిపిస్తాయి.

(ఈ పదములను కూడా చూడండి: కానాను, వాగ్ధానము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 12:01 వారు (ఇశ్రాయేలీయులు) ఇక మీదట బానిసలుగా ఉండరు, మరియు వారు వాగ్ధాన దేశమునకు వెళ్ళుచున్నారు!
  • 14:01 దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనలో భాగంగా వారు ధర్మశాస్త్రమునకు కూడా విధేయులు కావాలని దేవుడు వారిని చెప్పిన తరువాత, దేవుడు వారిని సీనాయి పర్వతము నుండి కానాను దేశముగా పిలువబడే వాగ్ధాన దేశమునకు నడిపించుటకు ఆరంభించెను.
  • 14:02 దేవుడు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల సంతానమునకు వాగ్ధాన భూమిని ఇస్తానని వారికి వాగ్ధనాము చేసియుండెను, అయితే అక్కడ అనేక విభిన్న జనాంగములు నివాసము చేయుచూ ఉండిరి.
  • 14:14 ఆ తరువాత దేవ్దుడు ప్రజలను తిరిగి వాగ్ధాన దేశపు అంచువరకు నడిపించెను.
  • 15:02 ఇశ్రాయేలీయులు వాగ్ధాన దేశములోనికి ప్రవేశించుటకు, వారు తప్పకుండ యోర్దాను నదిని దాటి వెళ్ళవలసియుండెను.
  • 15:12 ఈ యుద్ధము జరిగిన తరువాత, దేవుడు ఇశ్రాయేలు ప్రతి గోత్రమునకు వాగ్ధాన దేశమును విభజించి ఎవరి భాగములను వారికి పంచిపెట్టెను.
  • 20:09 దేవుని ప్రజలు వాగ్ధాన భూమిని విడిచిపెట్టి వెళ్లాలని బలవంతముగావించబడిన ఈ సమయమునే నిర్గమము లేక వెలివేయబడుట అని పిలుతురు.

పదం సమాచారం:

  • Strong's: H776, H3068, H3423, H5159, H5414, H7650