te_tw/bible/other/jewishleaders.md

5.6 KiB

యూదు అధికారులు, యూదు నాయకుడు

వాస్తవాలు:

"యూదు నాయకుడు” లేక “యూదు అధికారం" యాజకులు దేవుని ధర్మ శాస్త్ర ఉపదేశకులు తదితర మత నాయకులను సూచిస్తున్నది. వారికి తీర్పులు ఇతర మతేతర విషయాల్లో కూడా అధికారం ఉంది.

  • యూదు నాయకులు ప్రధాన యాజకులు, శాస్త్రులు (ధర్మ శాస్త్ర ఉపదేశకులు).
  • యూదు నాయకుల్లో రెండు ముఖ్య సమూహాలు పరిసయ్యులు, సద్దుకయ్యులు.
  • 70 మంది యూదు నాయకుల సమావేశం యూదు సమాలోచన సభ. ఇది యెరూషలేములో ధర్మశాస్త్రం గురించిన తీర్పులు ఇచ్చే సభ.
  • అనేకమంది యూదు నాయకులు తాము న్యాయవంతులమనే గర్వంతో ఉంటారు. వారు అసూయ వల్ల యేసుకు హాని తలపెట్టారు. వారు తమకు దేవుడు తెలుసునని అన్నారు అయితే వారాయనకు లోబడలేదు.
  • కొన్ని సార్లు " యూదులు" అనే మాట యూదు నాయకులను ముఖ్యంగా వారు యేసుపై కోపగించి ఆయనకు హాని కలిగించే సందర్భాల్లో వాడారు.
  • ఈ పదాలను ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "యూదు అధిపతులు” లేక “యూదు ప్రజల పాలకులు” లేక “యూదు మత నాయకులు."

(చూడండి: యూదుడు, ప్రధాన యాజకులు, సమాలోచన సభ, ప్రధాన యాజకుడు, పరిసయ్యుడు, యాజకుడు, సద్దూకయ్యుడు, శాస్త్రి)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 24:03 అనేకమంది మత నాయకులు కూడా వచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందారు. అయితే వారు పశ్చాత్తాప పడి వారి పాపాలు ఒప్పుకోలేదు.
  • 37:11 అయితే యూదుల మత నాయకులు ఈర్ష్య పడి కలిసి యేసును, లాజరును చంపాలని పథకం వేసారు..
  • 38:02 అతడు (యూదా) యూదు నాయకులు యేసు మెస్సియా అనే మాట నిరాకరించారని తెలిసి యేసును చంపడానికి కుట్రలో చేరాడు.
  • 38:03 ప్రధాన యాజకుని నాయకత్వంలో యూదు నాయకులు యేసును పట్టి ఇవ్వడానికి యూదాకు ముఫ్ఫై వెండి నాణాలు చెల్లించారు.
  • 39:05 ప్రధాన యాజకుడు యూదు నాయకులకు ఇలా జవాబిచ్చాడు, "అతడు (యేసు) మరణ శిక్షకు పాత్రుడు."
  • 39:09 మరుసటి ఉదయం, యూదు నాయకులు యేసును రోమా గవర్నర్ పిలాతు దగ్గరకు తెచ్చారు.
  • 39:11 అయితే యూదు నాయకులు గుంపు కలిసి "అతన్ని సిలువ వెయ్యండి!" అని అరిచారు.
  • 40:09 తరువాత యేసు మెస్సియా అని ఆయనపై నమ్మకం ఉంచిన యోసేపు, నికోదేము అనే ఇద్దరు యూదు నాయకులు పిలాతును యేసు శరీరం ఇమ్మని అడిగారు.
  • 44:07 మరుసటి రోజు, యూదు నాయకులు పేతురు, యోహానులను ప్రధాన యాజకుడు ఇతర మత నాయకుల దగ్గరకు తెచ్చారు.

పదం సమాచారం:

  • Strong's: G2453