te_tw/bible/kt/jew.md

3.3 KiB

యూదుడు, యూదదేశసంబంధ

వాస్తవాలు:

యూదులు అబ్రాహాము మనవడు యాకోబు సంతానం నుండి వచ్చిన ప్రజలు. "యూదుడు" అనే పేరు "యూదా" నుండి వచ్చింది.

  • ఇశ్రాయేలీయులు బబులోను ప్రవాసం నుండి యూదాకు తిరిగి వచ్చిన తరువాత ప్రజలు వారిని "యూదులు" అని పిలవడం ఆరంభించారు.
  • యేసు క్రీస్తు యూదుడు. అయితే, యూదు మత నాయకులు ఆయనను తిరస్కరించారు, ఆయన చంపబడాలని కోరారు.

(చూడండి: అబ్రాహాము, యాకోబు, ఇశ్రాయేలు, బబులోను, యూదు నాయకులు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 20:11 ఇశ్రాయేలీయులు ఇప్పుడు యూదులు అని పిలువబడుతున్నారు. వారిలో చాలా మంది తమ పూర్తి జీవితాలు బబులోనులో నివసించారు.
  • 20:12 కాబట్టి 70 సంవత్సరాల ప్రవాసం తరువాత, యూదులు ఒక చిన్న గుంపు యూదాలోని యెరూషలేం నగరానికి తిరిగి వచ్చారు.
  • 37:10 యూదులలో అనేకులు ఈ అద్భుతం కారణంగా యేసు నందు విశ్వాసం ఉంచారు.
  • 37:11 అయితే యూదుల మత నాయకులు ఈర్ష్యతో ఉన్నారు, కాబట్టి వారు యేసునూ, లాజరునూ కలిపి చంపడానికి పథకం వేశారు.
  • 40:02 "యూదుల రాజు" అని సిలువమీద యేసు తల మీదుగా రాయమని పిలాతు అజ్ఞాపించాడు.
  • 46:06 వెంటనే సౌలు "యేసు దేవుని కుమారుడు!" అని దమస్కు లో యూదులకు ప్రకటించడం మొదలు పెట్టాడు.

పదం సమాచారం:

  • Strong's: H3054, H3061, H3062, H3064, H3066, G2450, G2451, G2452, G2453, G2454