te_tw/bible/names/babylon.md

5.8 KiB

బబులోను, బాబిలోనియా, బాబిలోనియా, బబులోనీయులు

వాస్తవాలు:

బబులోను పట్టణం ప్రాచీన బాబిలోనియా ప్రాంతంలో ఉంది. ఇది బాబిలోనియా సామ్రాజ్యంలో భాగం.

  • బబులోను యూఫ్రటిసు నది తీరాన వెలసిన నగరం. కొన్ని వందల సంవత్సరాలు క్రితం బాబెలు గోపురం కట్టింది ఇక్కడే.
  • కొన్ని సార్లు ఈ పదం "బబులోను" మొత్తం బాబిలోనియా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, "బబులోను రాజు" మొత్తం సామ్రాజ్యం అంతా పరిపాలన చేశాడు. ఒక్క నగరాన్ని మాత్రమే కాదు.
  • బాబిలోనియా వారు చాలా శక్తివంతమైన ప్రజలు. వీరు యూదా రాజ్యంపై దాడి చేసి ప్రజలను బాబిలోనియాలో 70 సంవత్సరాలపాటు ప్రవాసంలో ఉంచారు.
  • ఈ ప్రాంతంలో ఒక భాగాన్ని "కల్దియ" అని పిలిచారు. ఇక్కడ నివసించే ప్రజలను "కల్దీయులు" అన్నారు. ఫలితంగా, ఈ పదం"కల్దియ" ను తరచుగా బాబిలోనియాను సూచించ డానికి ఉపయోగిస్తారు. (చూడండి: ఉపలక్ష్య అలంకారం
  • కొత్త నిబంధనలో, ఈ పదం "బబులోను" ను కొన్ని సార్లు విగ్రహ పూజ, ఇతర పాపపూరితమైన జీవిత విధానాలు, ప్రజలు, ప్రాంతాలు, ఆలోచనా విధానాలు మొదలైన వాటిని సూచించే రూపకాలంకారంగా ఉపయోగిస్తారు.
  • పద బంధం "మహా బబులోను” లేక “గొప్ప బబులోను పట్టణం" అనేదాన్ని రూపకాలంకారికంగా ఒక పట్టణం లేక ఒక పాపపూరితమైన పెద్ద ధనిక, జ్ఞాన పూరితమైన జాతి, లేక ప్రాచీన బబులోను పట్టణం కోసం వాడతారు.

(చూడండి: రూపకాలంకారంగా)

(చూడండి: బాబెలు, కల్దియ, యూదా, నెబుకద్నేజర్)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 20:06 ఆష్శూరీయులు ఇశ్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేసిన 100 సంవత్సరాల తరువాత, దేవుడు బాబిలోనియా రాజైన నెబుకద్నేజరును యూదా రాజ్యంపై, దాడి చేయడానికి ప్రేరేపించాడు. బబులోను అప్పటికి శక్తివంతమైన సామ్రాజ్యం.
  • 20:07 అయితే కొన్ని సంవత్సరాల తరువాత, యూదా రాజు బబులోనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాబట్టి, బబులోనీయులు తిరిగి వచ్చారు. యూదా రాజ్యంపై దాడి చేశారు. వారు పట్టుకుని యెరూషలేము పట్టణాన్ని ఆలయాన్ని నాశనం చేశారు. పట్టణంలో, ఆలయంలో ఉన్న నిధులను అన్నిటినీ తీసుకు పోయారు.
  • 20:09 నెబుకద్నేజర్, తన సైన్యం దాదాపుగా యూదా రాజ్యంలోని ప్రజలందరి బబులోను కు తీసుకు పోయారు. నిరుపేదలను మాత్రం పొలాలు సాగు చేయడానికి ఉండనిచ్చారు.
  • 20:11 సుమారు 70 సంవత్సరాల తరువాత బబులోను వారు పారసీకుల రాజు కోరేషు చేతిలో ఓడిపోయారు.

పదం సమాచారం:

  • Strong's: H3778, H3779, H8152, H894, H895, H896, G897