te_tw/bible/names/kingdomofjudah.md

5.5 KiB

యూద, యూదా రాజ్యం

వాస్తవాలు:

ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలన్నిటిలో యూదా గోత్రం పెద్దది. యూదా రాజ్యంలో యూదా గోత్రం, బెన్యామీను గోత్రాలు ఉన్నాయి.

  • సోలోమోను చనిపోయిన తరువాత దేశము రెండు రాజ్యాలుగా విడిపోయింది. ఇశ్రాయేలు, యూదా. యూదా రాజ్యము దక్షిణ రాజ్యము, ఉప్పు సముద్రానికి పశ్చిమంగా ఉంది.
  • యూదా రాజ్యానికి ముఖ్య పట్టణం యెరూషలెం.
  • యూదా రాజ్య రాజులు ఎనిమిది మంది యెహోవా దేవునికి లోబడ్డారు, ఆయనన్ను ఆరాధించడానికి ప్రజలను నడిపించారు. ఇతర యూదా రాజులు దుష్టులుగా ఉన్నారు, విగ్రహాలను పూజించడానికి ప్రజలను నడిపించారు.
  • అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యాన్ని (ఉత్తర రాజ్యం) వారిని ఓడించిన తరువాత 120 సంవత్సరాలకు బాబులోను దేశం యూదా రాజ్యాన్ని స్వాధీనపరచుకొంది. బాబులోను వారు పట్టణాన్ని, దేవాలయాన్ని నాశనం చేసారు, యూదాలోని అనేకమందిని బబులోనుకు బందీలుగా తీసుకొని వెళ్ళారు.

(చూడండి: యూదా, ఉప్పు సముద్రం)

బైబిలు రిఫరెన్సులు

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 18:07 కేవలం రెండు గోత్రాలు మాత్రమే అతనికి (రెహబాము) నమ్మకంగా ఉన్నాయి. ఈ రెండు గోత్రాలు యూదా రాజ్యం గా మారాయి.
  • 18:10 యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యమూ శత్రువులుగా మారాయి, తరచుగా ఒకరికి ఒకరు విరోధంగా పోరాడుకొంటున్నారు.
  • 18:13 యూదా రాజులు దావీదు సంతానము. వీరిలో కొందరు రాజులు మంచి వ్యక్తులు, వారు నీతిగా పరిపాలించారు, దేవుణ్ణి ఆరాధించారు. అయితే యూదా రాజులలో అనేకులు దుష్టులు, అవినీతిపరులు, వారు విగ్రహాలను ఆరాధించారు.
  • 20:01 యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం రెండూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాయి.
  • 20:05 ఇశ్రాయేలు రాజ్యంలోని ప్రజలు దేవుని విశ్వసించక, ఆయనకు లోబడని కారణంగా దేవుడి వారిని ఏ విధంగా శిక్షించాడో యూదా రాజ్యము లోని ప్రజలు చూసారు. అయినప్పటికీ వారు ఇంకా విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు, కనానీయుల దేవుళ్ళను పూజించారు.
  • 20:06 అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసిన 100 సంవత్సరాల తరువాత దేవుడు యూదా రాజ్యం మీదకు దండెత్తడానికి బాబులోను రాజు, నెబుకద్నెజరును పంపాడు.
  • 20:09 నెబుకద్నెజరునూ, అతని సైన్యమూ యూదా రాజ్యము లో దాదాపు ప్రజలనందరినీ బాబులోనుకు తీసుకొని వెళ్ళాడు, పొలాలలోని పంటలకోసం అతి పేదవారిని విడిచిపెట్టారు.

పదం సమాచారం:

  • Strong's: H4438, H3063