te_tw/bible/names/judah.md

2.1 KiB

యూదా

వాస్తవాలు:

యూదా యాకోబు పెద్ద కుమారుల్లో ఒకడు. అతని తల్లి లేయా. అతని సంతానం "యూదా గోత్రం."

  • యూదా తన సోదరులతో వారి తమ్ముడు యోసేపును గోతిలో పడవేసి చంపడానికి మారుగా బానిసగా అమ్మి వేయమని చెప్పాడు.
  • దావీదు రాజు, అతని తరువాత ఇతర యూదా రాజులంతా యూదా సంతానం. యేసు కూడా యూదా సంతతి వాడు.
  • సొలోమోను పరిపాలన ముగిసినప్పుడు ఇశ్రాయేలు జాతి రెండుగా చీలి యూదా రాజ్యం దక్షిణ రాజ్యంగా అయింది.
  • కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో యేసును "యూదా గోత్ర సింహం" అన్నారు.
  • "యూదుడు” “యూదయ" అనేవి "యూదా" నుండే వచ్చాయి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: యాకోబు, యూదుడు, యూదా, యూదయ, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3063