te_tw/bible/other/12tribesofisrael.md

2.7 KiB

ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు, ఇశ్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాలు, పన్నెండు గోత్రాలు

నిర్వచనం:

"ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు"అనే మాట యాకోబు పన్నెండుమంది కొడుకులకు, వారి సంతతికి వర్తిస్తుంది.

  • యాకోబు అబ్రాహాము మనవడు. దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు.
  • ఈ గోత్రాల పేర్లు ఇవి: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, దాను, నఫ్తాలీ, గాదు, ఆషేరు, ఇస్సాఖారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను.
  • లేవీ సంతతి వారు కనానులో భూభాగం వారసత్వంగా పొందలేదు. ఎందుకంటే వారు దేవుణ్ణి, అయన ప్రజలను సేవించడానికి ప్రత్యేకించబడిన వారు.
  • యోసేపుకు ఆ దేశంలో రెండు పాళ్ళు వచ్చింది. అవి ఎఫ్రాయిము, మనష్శే అనే అతని ఇద్దరు కొడుకులకు చెందాయి.
  • బైబిల్లో అనేక చోట్ల పన్నెండు గోత్రాలు జాబితా కొద్ది తేడాలతో ఉంది. కొన్ని సార్లు లేవీ, యోసేపు, లేక దాను గోత్రాల పేర్లు జాబితాలో కనిపించవు. కొన్ని సార్లు ఎఫ్రాయిము, మనష్శే అనే యోసేపు కొడుకుల పేర్లు ఉంటాయి.

(చూడండి: వారసత్వం, ఇశ్రాయేల్, యాకోబు, యాజకుడు, గోత్రం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3478, H7626, H8147, G1427, G2474, G5443