te_tw/bible/kt/israel.md

5.0 KiB

ఇశ్రాయేలు, ఇశ్రాయేలీయులు

వాస్తవాలు:

"ఇశ్రాయేలు" అనేది దేవుడు యాకోబుకు పెట్టిన పేరు. అంటే "అతడు దేవునితో పోరాడాడు."

  • యాకోబు సంతానాన్ని "ఇశ్రాయేలు ప్రజలు” లేక “ఇశ్రాయేలు జాతి” లేక “ఇశ్రాయేలీయులు" అన్నారు.
  • దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తన నిబంధన చేశాడు. వారు ఆయన ఎన్నికైన ప్రజ.
  • ఇశ్రాయేలు జాతిలో పన్నెండు గోత్రాలున్నాయి.
  • తరువాత సొలోమోను రాజు చనిపోయాక, ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా చీలిపోయింది: దక్షిణ రాజ్యం "యూదా," ఉత్తర రాజ్యం "ఇశ్రాయేలు."
  • సందర్భాన్ని బట్టి "ఇశ్రాయేలు" ను ఇలా అనువదించ వచ్చు. " ఇశ్రాయేలు ప్రజ ” లేక “ఇశ్రాయేలు జాతి".

(చూడండి: యాకోబు, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా, జాతి, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 08:15 పన్నెండు మంది కుమారులు పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలు అయ్యారు.
  • 09:03 ఈజిప్టు వారు ఇశ్రాయేలీయులచే బలవంతంగా అనేక భవనాలు, మొత్తంగా పట్టణాలు కట్టించారు.
  • 09:05 ఒక ఇశ్రాయేలు స్త్రీ జన్మ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
  • 10:01 వారు చెప్పాడు, "ఇశ్రాయేలు దేవుడు ఇలా చెబుతున్నాడు, 'నా ప్రజలను వెళ్ళనివ్వండి!'"
  • 14:12 అయితే ఇశ్రాయేలు ప్రజలు పోగై దేవునికి, మోషేకు వ్యతిరేకంగా సణిగారు.
  • 15:09 దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు పక్షంగా పోరాడాడు. ఆయన పెద్ద వడగళ్ళు కురిపించి అమోరీయులను హతం చేశాడు. అమోరీయులు చిందరవందర అయిపోయారు.
  • 15:12 యుద్ధం తరువాత దేవుడు ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ వాగ్దాన దేశంలో భూభాగం ఇచ్చాడు. తరువాత దేవుడు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నెమ్మదినిచ్చాడు..
  • 16:16 కాబట్టి దేవుడు విగ్రహారాధన నిమిత్తం ఇశ్రాయేలును శిక్షించాడు.
  • 43:06 "మనుషులు of ఇశ్రాయేలు మనుషులారా, మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా దేవుని శక్తి చేత యేసు అనేక సూచనలు అద్భుతాలు చేశాడు.

పదం సమాచారం:

  • Strong's: H3478, H3479, H3481, H3482, G935, G2474, G2475