te_tw/bible/other/council.md

3.5 KiB
Raw Permalink Blame History

సమాలోచన సభ, సమాలోచన సభలు

నిర్వచనం:

సమాలోచన సభ అంటే పెద్దలు ముఖ్య విషయాలలో సలహా సంప్రదింపుల కోసం, నిర్ణయాలు చేయడం కోసం సమకూడే సభ.

  • సమాలోచన సభను సాధారణంగా అధికారికంగా, కొంత వరకు శాశ్వత ప్రాతిపదికన ఒక ఇదమిద్ధమైన ఉద్దేశంతో, చట్టపరమైన నిర్ణయాలు చేయడం కోసం పెడతారు.
  • యెరూషలేములో "యూదు సమాలోచన సభ" (దీన్ని "సన్ హెడ్రిన్," అన్నారు) లో 70మది సభ్యులు ఉంటారు. ఇందులో యూదు నాయకులు, వారి ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనుదినంకలుసుకుని యూదు చట్టం గురించిన విషయాలను పరిష్కరిస్తూ ఉంటారు. సమాలోచన సభలోని మత నాయకులే యేసును న్యాయ విచారణ చేసి అయనకు మరణ శిక్ష విధించాలని నిర్ణయించారు.
  • ఇతర పట్టణాల్లో చిన్నసమాలోచన సభలు ఉంటాయి.
  • అపోస్తలుడు పౌలు తన సువార్త ప్రచారం నిమిత్తం అరెస్ట్ అయినప్పుడు రోమా సమాలోచన సభ ఎదుట నిలిచాడు.
  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని "న్యాయ విమర్శ సభ" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "చట్టసమావేశం” లేక “రాజకీయ సమావేశం" అనవచ్చు.
  • "సమాలోచన సభలో ఉండడం" అంటే ఒక ప్రత్యేక సమావేశంలో దేన్నైనా నిర్ణయించడానికి కూర్చోవడం.
  • is a వివిధ పదాలను గమనించండి. "కౌన్సిల్," అంటే "జ్ఞానం గల సలహా."

(చూడండి: సమావేశం, కౌన్సిల్, పరిసయ్యుడు, చట్టం, యాజకుడు, సద్దూకయ్యుడు, శాస్త్రి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4186, H5475, H7277, G1010, G4824, G4892