te_tw/bible/kt/yahweh.md

10 KiB

యెహోవా

వాస్తవాలు:

దేవుడు మోషెతో మండుచున్న పొదలోనుండి మాట్లాడినప్పుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోనడానికి “యెహోవా” అనే పదమును ఆయన వ్యక్తిగత పేరుగ తెలియపరచారు.

  • “యెహోవా” అనే పదమునకు “ఉన్నవాడు” లేక “ఉనికి” కలిగియున్నాడని అర్థమిచ్చు పదమునుండి తీసుకొనబడియున్నది.
  • “యెహోవా” అను పదమునకు “ఆయన” లేక “నేను” లేక “కలుగజేయువాడు అని అర్థములు కలవు.
  • దేవుడు ఎల్లప్పుడూ జివిస్తున్నాడని మరియు జీవించును అని ఈ పేరు తెలియజేయుచున్నది. ఆయన సదాకాలము ఉన్నాడని దానికి మరియొక అర్థము కలదు.
  • ఆచరమును పాటించుచు, అనేక పరిశుద్ధ గ్రంథములలో “యెహోవా” అనే పదమునకు “ప్రభువు” అని ఉపయోగించబడియున్నది. యెహోవా పేరును తప్పుగా ఉచ్చరించెదమేమో అని యూదులు “యెహోవా” అనే పదము లేఖనలలో ఉపయోగించబడియున్న ప్రతి చోట “ప్రభువు” అని పలుకుటకు ప్రారంభించడం ద్వారా ఈ పధ్ధతి వచెనని చారిత్రాత్మకముగ ఉన్న వాస్తవ సంగతియైయున్నది. దేవుని వ్యక్తిగత నామమును (పేరును) గౌరవించులాగున మరియు హెబ్రీ భాషలో వాడబడు వేరొక “ప్రభువు” అనే పదమునకు కలుగు అర్థమును వేరుపరచులాగున ఆధునిక బైబిల్లలో “ప్రభువు” అనే పదమును పెద్ద అక్షరములలో వ్రాయబడియున్నది.
  • పాత నిబంధన గ్రంథములో ఉపయోగించబడిన హెబ్రీ భాషలో “యావ్హె” అని పిలువబడినట్లుగానే యుఎల్బి మరియు యుడిబి బైబిల్లలో కూడా ఈ పదమును అనువాదం చేసిరి.
  • “యావ్హే” అనే పదము క్రొత్త నిబంధన గ్రంథములో ఒక్క మారును కనుబడలేదు; పాత నిబంధన గ్రంథములోని వాక్య భాగమును సూచించుటకు “ప్రభువు” అనే గ్రీకు పదమును మాత్రమే ఉపయోగించబడియున్నది.
  • పాత నిబంధన గ్రంథములో, దేవుడు తనను గూర్చి మాట్లాడుచున్నప్పుడు, నామవాచకం ఉపయోగించడానికి బదులుగా ఆయన పేరునే ఉపయోగించారు.
  • దేవుడే అక్కడ మాట్లాడుచున్నాడని చదువరులకు సూచించడానికి యుఎల్బి బైబిల్లో “నేను” అనే నామవాచక పదమును ఉపయోగించియున్నారు.

తర్జుమా సలహాలు

  • “యహ్వే” అనే పదమును లేక వాక్యమును “నేనున్నాను” లేక “జీవించువాడు” లేక “ఉన్నవాడు” లేక “జీవించుచున్నవాడు” అని తర్జుమా చేయవచ్చును.
  • ఈ పదమును “యహ్వే” అని ఏరితిగా పలుకుతారో అదే విధముగా వ్రాయవచ్చును.
  • కొన్ని సంఘాల శాఖలలో “యహ్వే” అనే పదమును ఉపయోగించడానికి ఇష్టపడరు అందువలన సాంప్రదాయకంగా వచ్చిన పద్ధతి ప్రకారముగా “ప్రభువు” అనే పదమును ఉపయోగిస్తారు. ఈ పదమును గట్టిగా చదువుచున్నప్పుడు “ప్రభువు” అనే పదమునకుగల అర్థమును స్పురింప జేయవచ్చును అని ఇక్కడ గమనించతగిన ప్రాముఖ్యమైన సంగతియైయున్నది. “ప్రభువు” అనే పేరుకు (యహ్వే) మరియు “ప్రభువు” అనే బిరుదుకుగల వెత్యాసమును తెలియపరచుటకు కొన్ని భాషలలో ఆ పదముకు తోడుగా లేక వ్యాకరణ సంబంధమైన పదమును జోడిస్తారు.
  • వాక్య భాగములలో యహ్వే అనే పదము వచ్చినప్పుడు సాద్యమైనంతవరకు దానిని అలాగే ఉంచడము మంచిది అయితే వాక్య భాగము సహజంగా మరియు స్పష్టంగా అర్థం కావడానికి కొన్ని తర్జుమాలలో నామవాచక పదమును మాత్రమే ఉపయోగిస్తారు.
  • “యహ్వే సెలవిచ్చునది ఏమనగా” అని ఒక వాక్యమును ప్రారంభించవచ్చును.

(తర్జుమా సలహాలు: పేర్లను ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: దేవుడు, ప్రభువు, ప్రభువు, మోషె, తెలియప్రచడం)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 09:14 “నేను ఉన్నవాడను అని దేవుడు చెప్పెను. ‘ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని’ వారితో చెప్పమనెను. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా అని వారితో చేప్పమనెను. నిరంతరమూ నా నామము ఇదే.”
  • 13:04 అప్పుడు దేవుడు వారికి నిబంధన ఇచ్చి, “నీ దేవుడైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” అని సెలవిచ్చెను.
  • 13:05 “విగ్రహములను నీవు చేసికొనకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.”
  • 16:01 నిజమైన దేవుడైన యెహోవాను పూజించుటకు బదులుగా ఇశ్రాయేలీయులు కనానీయుల దేవతలను పూజించిరి.
  • 19:10 అప్పుడు ఏలియా, “అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడైన యెహోవా నీవు ఇశ్రాయేలీయుల దేవుడవనియు మరియు నేను నీ దాసుడననియు ఈ దినము తెలియపరచుము” అని ప్రార్థించెను.

పదం సమాచారం:

  • Strong's: H3050, H3068, H3069