te_tw/bible/names/moses.md

4.3 KiB

మోషే

వాస్తవాలు:

మోషే ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలకు పైగా ప్రవక్తగానూ, నాయకుడుగానూ ఉన్నవాడు.

  • మోషే బాలుడిగా ఉన్నప్పుడు, మోషే తల్లిదండ్రులు బాలుడైన మోశేను ఒక బుట్టలో ఉంచి నైలునదిలోని రెళ్ళు మొక్కలలో ఐగుప్తు ఫరోకు కనిపించకుండా దాచారు. మోషే సోదరి మిరియాము అక్కడ గమనిస్తూ ఉంది. ఫరో కుమార్తె బాలుడైన మోషెను కనుగొన్న కారణంగా అతను బ్రతికాడు, ఫరో కుమార్తె మోషేను తన కుమారుడిలా అంతఃపురంలో పెంచడానికి తీసుకొని వెళ్లింది.
  • ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు,
  • ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చిన తరువాత, వారు అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు పది ఆజ్ఞలు రాసిన రాతి పలకలను దేవుడు మోషేకు ఇచ్చాడు.
  • మోషే జీవిత చరమాంకంలో మోషే వాగ్దానదేశాన్ని చూసాడు, కాని దేవునికి అవిధేయత చూపిన కారణంగా దానిలో ప్రవేశించలేక పోయాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: మిరియాము, వాగ్దాన దేశం, పది ఆజ్ఞలు)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్త్తాంతములనుండి ఉదాహరణలు:

  • 09:12 ఒక రోజున మోషే తన గొర్రెలను కాస్తూ ఉండగా, కాలుతున్న పొదను చూసాడు.
  • 12:05 మోషే “భయపడకుడి! దేవుడు ఈ రోజున మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మిమ్మును రక్షిస్తాడు.” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
  • 12:07 ఎర్ర సముద్రం మీద తన చేతిని ఎత్తి యుంచి నీటిని పాయలు చేయాలని డేవుడు మోషే తో చెప్పాడు.
  • 12:12 ఐగుప్తీయులు చనిపోయినట్టు ఇశ్రాయేలీయుల చూసినప్పుడు, వారు దేవున్ని విశ్వసించారు, మోషే దేవుని ప్రవక్త అని నమ్మారు.
  • 13:07 దేవుడు ఈ పది ఆజ్ఞలను రెండు పలకల మీద రాసాడు, వాటిని మోషే కి ఇచ్చాడు.

పదం సమాచారం:

  • Strong's: H4872, H4873, G3475