3.9 KiB
3.9 KiB
బయలుపరచు, బయలు పరచబడడం, ప్రత్యక్షత
నిర్వచనం:
“బయలుపరచు” పదం ఏదైనా తెలియపరచబడడానికి కారణం కావడం అని అర్థం. “ప్రత్యక్షత” అంటే తెలియపరచబడినది అని అర్థం.
- దేవుడు తాను సృష్టించిన ప్రతీ దాని ద్వారా తనను తాను బయలుపరచుకొన్నాడు, ప్రజలతో తాను మాట్లాడిన, లిఖిత పూర్వక సందేశాల ద్వారా బయలుపరచుకొన్నాడు.
- దేవుడు తనను గూర్చి కలల ద్వారాను లేదా దర్శనముల ద్వారాను బయలుపరచుకొనియున్నాడు.
- “యేసు క్రీస్తు నుండి ప్రత్యక్షత” ద్వారా సువార్తను తాను పొందుకొనియున్నానని పౌలు చెప్పినప్పుడు, యేసుక్రీస్తే స్వయాన తనకు సువార్తను గూర్చి వివరించియున్నాడని పౌలు అర్థం.
- క్రొత్త నిబంధనలోని “ప్రకటన గ్రంథం" అంత్య కాలములో జరగబోయే సంభవాలను గూర్చి దేవుడు బయలుపరచాడు. దర్శనముల ద్వారా అపొస్తలుడైన యోహానుకు ఆయన బయలుపరచియున్నాడు.
అనువాదం సూచనలు:
- “బయలుపరచు” పదం "తెలియపరచు" లేదా "బహిర్గతం చేయడం" లేదా "స్పష్టంగా చూపించడం" అనే పదాలతో ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, “ప్రత్యక్షత” పదం "దేవుని నుండి సమాచారం" లేదా "దేవుడు బయలుపరచిన సంగతులు" లేదా "దేవుని గురించిన బోధలు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు. అనువాదంలో "బయలుపరచు" అర్థం ఉండేలా చూడడం ఉత్తమం.
- “ప్రత్యక్షత లేనప్పుడు” పదబంధం “దేవుడు తనను గూర్చి ప్రజలకు బయలుపరచనప్పుడు” లేదా “దేవుడు తన ప్రజలతో మాట్లాడనప్పుడు” లేదా “ప్రజల మధ్యలో సంభాషించని దేవుడు” అని కూడా అనువదించబడవచ్చు.
(చూడండి: సువార్త, సువార్తలు, కల, దర్శనం)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H241, H1540, H1541, G601, G602, G5537