te_tw/bible/other/vision.md

3.2 KiB

దర్శనము, దర్శనములు , కల్పన

వాస్తవాలు :

“దర్శనము” అనేది ఒక మనిషి దేనినైనా చూచుటను తెలియచేయుచున్నది. దర్శనము అనేది దేవుడు మనుష్యులకు తెలియజేసే అసాధారణమైన లేదా అతీంద్రియమైన వర్తమానముగా పరిగణింపబడుతుంది.

  • సాధారణముగా, వ్యక్తి నిద్రనుండి మేలుకున్నపుడు ఈ దర్శనములను చూస్తాడు. అయితే, కొన్నిసార్లు నిద్రపోతున్న సమయంలో కలలో ఏదైనా చూచినప్పుడు ఆది దర్శనము గా చెప్పబడుతుంది. ఏదైనా ప్రాముఖ్యమైన విషయాలను చెప్పడానికి ప్రజలకు దేవుడు దర్శనాలను పంపిస్తాడు. ఉదాహరణకు, పేతురు అన్యజనుల వద్దకు వెళ్ళవలెనని దేవుడు ఆశించినట్లు దర్శనము ద్వారా తెలుసుకున్నాడు.

తర్జుమా సలహాలు:

  • “ దర్శనమును చూచెను” అనుమాట “ఒక అసాధారణమైన విషయాన్ని దేవుని ద్వారా చూచుట “ లేదా “ దేవుడు ఒక ప్రత్యేకమైన సంగతిని చూపించుట ” అని అనువదింపబడెను.
  • కొన్ని భాషలలో “ దర్శనము ” మరియు “ కల ” కు వేర్వేరు పదాలు లేవు. కాబట్టి “దానియేలు తన మనసులో కలలను దర్శనములను కలిగియుండెను ” అనుమాటను “దానియేలు నిద్రపోతున్న సమయంలో కలకనుచుండెను మరియు దేవుడు ఆ కలలలో కొన్ని అసాధారణమైన విషయాలను చూపించుచుండెను” అని కూడా అనువదించుకోవచ్చు.

(దీనిని చూడండి: కల)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H2376, H2377, H2378, H2380, H2384, H4236, H4758, H4759, H7203, H7723, H8602, G3701, G3705, G3706