te_tw/bible/other/dream.md

4.2 KiB

కల

నిర్వచనం:

కల అంటే మనుషులు తమ నిద్రలో అనుభవించే ఆలోచనలు.

  • కలలు తరచుగా కలలు కనే వారికి అవి నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తాయి. అయితే అవి వాస్తవాలు కాదు.
  • కొన్ని సార్లు దేవుడు తన ప్రజలు కల నుండి దేన్నైనా నేర్చుకోవాలని కలలు ఇస్తాడు. అయన నేరుగా మనుషులతో వారి కలల ద్వారా మాట్లాడాడు.
  • బైబిల్లో, దేవుడు ప్రత్యేకమైన కలల ద్వారా కొందరికి సందేశం ఇవ్వాలని, అంటే భవిషత్తులో సంభవించే వాటిని గురించి.
  • కల వేరు, దర్శనం వేరు. కలలు ఒక వ్యక్తి నిద్రలో వస్తాయి. అయితే దర్శనాలు సాధారణంగా ఒక వ్యక్తి మెలకువగా ఉన్నప్పుడే వస్తాయి.

(చూడండి: దర్శనం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 08:02 యోసేపు సోదరులు అతణ్ణి ద్వేషించారు. ఎందుకంటే వారి తండ్రి అతణ్ణి ఎక్కువగా ప్రేమించాడు.అంతేగాక యోసేపుకు ఒక వచ్చింది. అతడు వారి అధిపతి అవుతాడని దాని అర్థం.
  • 08:06 ఒక రాత్రి, ఫరో, అంటే ఈజిప్టు రాజుకు రెండు కలలు వచ్చాయి, అవి అతణ్ణి కలవర పరిచాయి. తన సలహాదారులెవరూ ఆ కలల అర్థం చెప్పలేక పోయారు.
  • 08:07 దేవుడు యోసేపుకు ఆ కలల అర్థం చెప్పే సామర్థ్యం ఇచ్చాడు._, కాబట్టి ఫరో యోసేపును చెరసాల నుండి రప్పించాడు. యోసేపు కలల భావం వివరించాడు. "దేవుడు ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన పంట కోత, ఏడు సంవత్సరాలు కరువు ఇస్తాడు."
  • 16:11 కాబట్టి ఆ రాత్రి, గిద్యోను సైనిక శిబిరానికి పోయి మిద్యాను సైనికుడు తన స్నేహితునితో చెబుతున్న కల విన్నాడు. ఆ మనిషి స్నేహితుడు ఇలా చెప్పాడు, "కల ఏమిటంటే గిద్యోను సైన్యం మిద్యాను సైన్యాన్ని ఓడిస్తుంది."
  • 23:01 అతడు (యోసేపు) ఆమె (మరియ)ను అవమానించడం ఇష్టం లేక నెమ్మదిగా ఆమెకు విడాకులు ఇవ్వాలని భావించాడు.

పదం సమాచారం:

  • Strong's: H1957, H2472, H2492, H2493, G1797, G1798, G3677