te_tw/bible/kt/temple.md

6.6 KiB

ఆలయం

వాస్తవాలు:

ఆలయం ఒక భవనం చుట్టూరా ప్రహరీ ఉండి, బయటి వసారాలు ఉన్న నిర్మాణం. అక్కడ ఇశ్రాయేలీయులు ప్రార్థించడానికి, దేవునికి బలి అర్పణలు చెల్లించడానికి వస్తారు. అది యెరూషలేము పట్టణంలో మోరియా కొండపై ఉంది.

  • తరచుగా "ఆలయం" అనే పదం మొత్తం ఆలయం కట్టడాలను, బయటి మండువా లోగిళ్ళను, మధ్యనున్న ముఖ్యభవనాన్ని సూచిస్తుంది. కొన్ని సార్లు ఆలయం అంటే ముఖ్య భవనం.
  • ఆలయం భవనం లో రెండు గదులు ఉన్నాయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం.
  • దేవుడు ఆలయాన్ని తన నివాస స్థలం అన్నాడు.
  • సొలోమోను రాజు తన పరిపాలన కాలంలో ఆలయం నిర్మించాడు. అది యెరూషలేములో దేవుని శాశ్వత ఆరాధన స్థలం.
  • కొత్త నిబంధనలో, " పరిశుద్ధాత్మకు ఆలయం" అనే మాటను సమూహంగా యేసు విశ్వాసులకు ఉపయోగిస్తారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ వారిలో జీవిస్తూ ఉంటాడు.

అనువాదం సలహాలు:

  • సాధారణంగా ప్రజలు "ఆలయంలో," ఉన్నారు అని రాస్తే ఆలయ భవనం బయటి ఆవరణలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆలయం బయటి ఆవరణ.” లేక “ఆలయం నిర్మాణ సముదాయం" అని స్పష్టం చెయ్యవచ్చు.
  • ఇదమిద్ధంగా భవనం అనేది కొన్నిఅనువాదాల్లో "ఆలయం" లేక "ఆలయం భవనం" అని రాస్తారు.
  • దీన్ని అనువదించే విధానం "దేవుని పరిశుద్ధ నిలయం” లేక “పరిశుద్ధ ఆరాధన స్థలం."
  • తరచుగా బైబిల్లో, ఆలయం అంటే "యెహోవా నివాసం” లేక “దేవుని ఇల్లు."

(చూడండి: బలి అర్పణ, సొలోమోను, బబులోను, పరిశుద్ధాత్మ, ప్రత్యక్ష గుడారం, బయటి న్యాయ స్థానం, సియోను, ఇల్లు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 17:06 ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించడం కోసం బలి అర్పణలు ఇవ్వడం కోసం దావీదు ఒక ఆలయం కట్టాలని సంకల్పించాడు.
  • 18:02 యెరూషలేములో, సొలోమోను ఆలయం నిర్మించాడు. దానికోసం అతని తండ్రి దావీదు ముందుగానే పథకం వేసి కావలసిన సరంజామా సమకూర్చాడు. ప్రత్యక్ష గుడారం లో ప్రజలు దేవుణ్ణి ఆరాధించి బలి అర్పణలు చేసిన విధంగానే ఇప్పుడు ఆలయం లో చేస్తున్నారు. దేవుడు ఆలయంలో వెలసి తన ప్రజల మధ్య నివసించాడు.
  • 20:07 వారు (బబులోనీయులు) యెరూషలేము పట్టణాన్ని పట్టుకుని, నాశనం చేశారు. ఆలయంలో నుండి, విలువైన వస్తువులను తీసుకు పోయారు.
  • 20:13 ప్రజలు యెరూషలేముకు వచ్చినప్పుడు వారు ఆలయం తిరిగి కట్టించి ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించారు.
  • 25:04 తరువాత సాతాను యేసును ఆలయం అత్యున్నతమైన గోపురానికి తీసుకుపోయి ఆయనతో ఇలా చెప్పాడు, "నీవు దేవుని కుమారుడి వైతే ఇక్కడ నుంచి దూకు. ఎందుకంటే 'నీ కాలికి రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారు.' అని రాసి ఉంది కదా."
  • 40:07 యేసు చనిపోయాక పెద్ద భూకంపం వచ్చింది. ఆలయంలో ప్రజలను దేవుని సన్నిధినుండి వేరు పరచే తెర పైనుండి కిందకి రెండుగా చినిగి పోయింది.

పదం సమాచారం:

  • Strong's: H1004, H1964, H1965, H7541, G1493, G2411, G3485