te_tw/bible/names/solomon.md

5.9 KiB

సొలొమోను

వాస్తవాలు:

సొలొమోను రాజైన దావీదుకు పుట్టిన కుమారులలో ఒకడైయుండెను. తన తల్లి పేరు బత్సెబా.

  • సొలొమోను రాజైయుండినప్పుడు, నీకు ఏమి కావాలో కోరుకొనుము అని దేవుడు సొలొమోనుకు చెప్పెను. అందుచేత సొలొమోను ప్రజలను న్యాయముగాను మరియు మంచిగాను పాలించుటకు జ్ఞానమును ఇమ్మని అడిగెను. దేవుడు సొలొమోను మనవితో సంతోషించినందున, ఆయన తనకు జ్ఞానమును మరియు ఐశ్వర్యమును అనుగ్రహించెను.
  • సొలొమోను యెరూషలేములో కట్టిన అద్భుతమైన దేవాలయమునుబట్టి ప్రసిద్ధి చెందియుండెను.
  • సొలొమోను తన పాలనను ఆరంభించిన ప్రారంభ సంవత్సరాలలో చాలా జ్ఞానంగా పాలించినప్పటికి, ఆ తరువాత మూర్ఖముగా అన్య స్త్రీలను వివాహము చేసికొనెను మరియు అన్య దేవతలను ఆరాధించుట ప్రారంభించెను.
  • సొలొమోను అపనమ్మకమునుబట్టి, తన మరణము తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను యూదా మరియు ఇశ్రాయేలు అను రెండు రాజ్యములుగా విభజించెను. ఈ రాజ్యములు అనేకమార్లు ఒకదానితో ఒకటి యుద్ధములు చేసికొనెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: బత్సేబా, దావీదు, ఇశ్రాయేలు, యూదా, ఇశ్రాయేలు రాజ్యము, దేవాలయము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 17:14 ఆ తరువాత, దావీదు మరియు బత్సేబాలకు ఇంకొక కుమారుడు పుట్టెను, ఆ కుమారునికి వారు సొలొమోను అని పేరు పెట్టెను.
  • 18:01 అనేక సంవత్సరములైన తరువాత, దావీదు మరణించెను, మరియు తన కుమారుడైన __ సొలొమోను __ పాలించుటకు ఆరంభించెను. దేవుడు సొలొమోనుతో మాట్లాడెను మరియు నీకేమి కావాలో కోరుకొమ్మని తనని అడిగెను. సొలొమోను జ్ఞానము ఇమ్మని అడిగినప్పుడు, దేవుడు సంతోషించి, లోకములోనే తనని అత్యంత జ్ఞానవంతునిగా చేసెను. సొలొమోను అనేక విషయములు నేర్చుకొనెను మరియు తను జ్ఞానముగల తీర్పరియైయుండెను. దేవుడు తనను అత్యంత శ్రీమంతునిగాను చేసియున్నాడు.
  • 18:02 యెరూషలేములో దేవాలయము నిర్మించాలని దావీదు ప్రణాళిక వేసిన ఆలోచనతో మరియు తెప్పించిన సామాగ్రితో సొలొమోను దేవాలయమును నిర్మించెను.
  • 18:03 అయితే సొలొమోను ఇతర దేశములనుండి వచ్చిన స్త్రీలను ప్రేమించెను. సొలొమోను వృద్ధుడైనప్పుడు తమ దేవతలను ఆరాధించెను.
  • 18:04 ఈ విషయమును బట్టి, దేవుడు సొలొమోను మీద చాలా కోపము చేసికొనెను, సొలొమోను అపనమ్మకమును బట్టి శిక్షగా, సొలొమోను మరణించిన తరువాత ఇశ్రాయేలు దేశమును రెండు భాగాలుగా విభజిస్తానని వాగ్ధానము చేసెను.

పదం సమాచారం:

  • Strong's: H8010, G4672