te_tw/bible/other/serpent.md

3.8 KiB
Raw Permalink Blame History

సర్పము, సర్పములు, పాము, పాములు, విష సర్పము, విష సర్పములు

వాస్తవాలు:

ఈ పదములన్నియు ప్రాకే ప్రాణిని సూచిస్తాయి, ఇది పొడువుగా ఉంటూ, సన్నని మరియు పెద్ద శరీరమును కలిగి, కోరలుగల దవడలు కలిగి, నేల మీద వెనక్కి జారుతూ ముందుకు ప్రాకుతూ వెళ్తుంది. “సర్పము” అనే ఈ పదమును సాధారణముగా పెద్ద పామును సూచిస్తుంది మరియు “విష సర్పము” అనేది సర్పము తన వేటలో విషమును ఉపయోగించే ఒక విధమైన పామును సూచిస్తుంది.

  • ఈ ప్రాణిని దుష్టుడైన వ్యక్తిని, విశేషముగా మోసగించే వ్యక్తిని సూచించుటకు అలంకారముగా ఉపయోగించబడింది.
  • మత సంబంధమైన నాయకులను “సర్ప సంతానమని” యేసు పిలిచాడు, ఎందుకంటే వారు ప్రజలను మోసగిస్తూ, ప్రజలపట్ల అన్యాయముగా నడుచుకొంటూ నీతిమంతులవలె ప్రవర్తిస్తూ ఉంటాయి.
  • ఏదేను తోటలో సాతాను హవ్వతో మాట్లాడి, హవ్వను దేవునికి అవిదేయురాలుగా చేసిన సందర్భములో వాడు సర్ప రూపమునే వాడుకొనియున్నాడు.
  • హవ్వ పాపము చేయునట్లు సర్పము శోధించిన తరువాత, హవ్వ మరియు తన భర్త ఆదాము ఇరువురు పాపము చేసిరి, దేవుడు సర్పమును శపించెను. ఆ తరువాత ఇప్పటినుండి సర్వ సర్పములన్నియు నేల మీద ప్రాకునని చెప్పెను. ఈ మాటను బట్టి సర్పము ప్రాకకుముందు దానికి కాళ్ళు ఉండిఉండవచ్చునని తెలియవచ్చుచున్నది.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: శాపము, మోసగించు, అవిధేయత, ఏదేను, దుష్టాత్మ, సంతానము, వేట, సాతాను, పాపము, శోధించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0660, H2119, H5175, H6620, H6848, H8314, H8577, G21910, G20620, G37890