te_tw/bible/other/deceive.md

4.4 KiB
Raw Permalink Blame History

మోసగించు, మోసం, మోసగాడు, మోసపూరితమైన, వంచన, భ్రమ

నిర్వచనం:

"మోసగించు" పదం నిజం కాని దేనినైనా విశ్వసించేలా చెయ్యడం అని అర్థం. ఎవరినైనా మోసం చేసే చర్యను "మోసం" లేదా "వంచన" అని పిలువబడుతుంది.

  • తప్పు అయిన దానిని ఇతరులు నమ్మేలా చేసేవానిని "మోసగాడు." ఉదాహరణకు, సాతాను "మోసగాడు" అని పిలువబడ్డాడు. వాడు నియంత్రించే దురాత్మలు మోసగాళ్ళు.
  • సత్యం కాని ఒక వ్యక్తి, చర్య, లేదా సందేశం మొదలైన వాటిని మోసపూరితమైనవి అని వర్ణించబడతాయి.
  • "మోసం” “కపటం(వంచన)" పదాలకు ఒకే అర్థం ఉంది, అయితే అవి ఉపయోగించబడే విధానంలో కొంత స్వల్ప వ్యత్యాసం ఉంది.
  • "మోసపూరితమైన," "వంచనతో కూడిన" వర్ణన పదాలకు ఒకే అర్థం ఉంది, ఒకే సందర్భంలో ఉపయోగించబడతాయి.

అనువాదం సూచనలు:

  • "మోసపరచు" పదాన్ని "అబద్ధం చెప్పడం" లేదా "తప్పుడు నమ్మకం ఉండేలా చెయ్యడం" లేదా "ఒకరు సత్యం కాని దానిని నమ్మేలా చెయ్యడం" అని ఇతర విధానాలలో అనువదించబడవచ్చు.
  • "మోసగించబడిన" పదం "తప్పు మాట గురించి ఆలోచించేలా చెయ్యడం" లేదా "అబద్ధం చెప్పడం" లేదా "వంచించడం" లేదా "బుద్ధిహీనునిగా చెయ్యడం" లేదా "తప్పుగా నడిపించడం" అని అనువదించబడవచ్చు.
  • "మోసగాడు" పదం "అబద్ధికుడు” లేదా "తప్పుగా నడిపించువాడు" లేదా మోసం చేసేవాడు" అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, "కపటం” లేక “మోసం" పదాలు "అసత్యం" లేదా "అబద్ధాలాడడం" లేదా కపటం" లేదా "అవినీతిగా ఉండడం" అని అర్థం ఇచ్చే పదాలతో అనువదించబడవచ్చు.
  • "కపటమైన” లేక “మోసకరం" పదాలు ఇతరులను అసత్యమైన వాటిని విశ్వసించేలా చేసే మాటలు లేక చర్యలనూ జరిగిచే వ్యక్తిని వివరించేటప్పుడు "అసత్యమైన” లేదా "తప్పుగా నడిపించడం" లేదా "అబద్దాలాడడం" అని అనువదించవచ్చు.

(చూడండి:true)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0898, H2048, H3577, H3584, H3868, H4123, H4820, H4860, H5230, H5377, H5558, H6121, H6231, H6601, H7411, H7423, H7683, H7686, H7952, H8267, H8496, H8582, H8591, H8649, G05380, G05390, G13860, G13870, G13880, G18180, G38840, G41050, G41060, G41080, G54220, G54230